మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచిర్యాలలో కిలాడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ.. కోటి రూపాయలకు పైగా మోసం

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల : నమ్మకంగా మాట్లాడుతుంది. ఇంటి పరిస్థితులు ఆరా తీస్తుంది. ఆత్మీయురాలిగా ఫోజులు కొడుతూ నేనున్నానంటూ భరోసానిస్తుంది. అలా గ్రిప్ దొరికాక నమ్మినవారిని నట్టేట ముంచుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ కోటి రూపాయల మేర కుచ్చుటోపి పెట్టింది. నిరుద్యోగులను నమ్మించి వంద మందికి పైగా మోసం చేసింది.

పరిచయమైతే చాలు పల్టీ కొట్టించే బాపతు సదరు మోసగత్తె. తెలియనివారిని సైతం ఆప్యాయంగా పలకరించి బుట్టలో వేసుకునే కిలాడీ. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వందల మందిని నిండా ముంచిన ఆ మాయలేడీ చివరకు ఐపీ పెట్టేసింది. దాంతో బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వినిపించారు.

 భర్తతో దూరం.. మోసాలతో నిరుద్యోగులకు గాలం

భర్తతో దూరం.. మోసాలతో నిరుద్యోగులకు గాలం

బెల్లంపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సుమలత డిగ్రీ వరకు చదువుకుంది. అనంతరం పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. అయితే భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిగా ఉంటోంది. అయితే కుటుంబ పోషణ కోసం మోసాలు చేయడం పనిగా పెట్టుకుంది. ఆ మేరకు బెల్లంపల్లికి చెందిన ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా నియమించుకుని నిరుద్యోగులను మోసం చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వెలువడితే చాలు.. ఓ అద్దె కారు కిరాయికి తీసుకుని నిరుద్యోగులకు గాలం వేసేందుకు బయల్దేరుతుంది. ఆమె ముందు సీట్లో దర్జాగా కూర్చుంటే.. వెనుక సీట్లో కూర్చుండే ఇద్దరు అసిస్టెంట్లు ఆ మాయాలేడీని ప్రభుత్వ అధికారిగా నమ్మించేవారు. అలా పలు ఉద్యోగాలకు సంబంధించి చాలామంది నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. మేడమ్‌ను నమ్మితే మీకు ఉద్యోగం కన్ఫామ్ అంటూ అసిస్టెంట్లు చెప్పే మాటలతో నిరుద్యోగులు ఐస్ అయిపోయి అడిగినంత ముట్టజెప్పేవారు. అలా ఉద్యోగానికో రేటుతో లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

వీళ్ల పైశాచికం పాడుగానూ.. వేశ్యలపై గ్యాంగ్ రేప్<br />వీళ్ల పైశాచికం పాడుగానూ.. వేశ్యలపై గ్యాంగ్ రేప్

రాజకీయ నేతల పేర్లు చెప్పి..!

రాజకీయ నేతల పేర్లు చెప్పి..!

సదరు మాయాలేడీ మాటలు నమ్మి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ కిలాడీ బారిన పడి మోసపోయారు. నిరుద్యోగులతో మాట్లాడేటప్పుడు వారికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకునేది. ఆ క్రమంలో ఎంతోమంది రాజకీయ నాయకుల పేర్లు వాడుకునేదని సమాచారం.

అధికార పార్టీ ప్రముఖ నాయకులతో పాటు పలువురి లీడర్ల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికేది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు నిలదీయడం మొదలుపెట్టారు. దాంతో తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వత్తిడి పెంచారు. ఆ క్రమంలో బాధితులకు డబ్బులు ఎగ్గొట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది సదరు కిలాడీ.

 వందల మందికి టోకరా.. లక్షల్లో వసూలు

వందల మందికి టోకరా.. లక్షల్లో వసూలు

ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం అంటూ దాదాపు వందమందిని నిండా ముంచింది సుమలత. దాదాపు 130 మందిని మోసం చేసి చివరకు ఐపీ నోటీసులు పంపించింది. డబ్బులు తీసుకునేంతవరకు తీయగా మాట్లాడే సుమలత.. ఆ తర్వాత మొఖం చాటేసేది. కోర్టులో కేసు పెండింగ్ ఉందని.. ఎన్నికల కోడ్ ఉందని.. అలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునేది. అయితే బాధితులు ఆమె మాటలతో విసుగు చెంది తమ డబ్బులు తమకు ఇవ్వాలని వత్తిడి పెంచారు. ఆ క్రమంలో చాలామందికి ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్లపై అగ్రిమెంట్ రాసిచ్చింది. అయితే ఇటీవల ఐపీ నోటీసులు పంపించడంతో బాధితులు అవాక్కయ్యారు.

అప్పుసప్పు జేసి మరీ మాయలేడీ చేతిలో..!

అప్పుసప్పు జేసి మరీ మాయలేడీ చేతిలో..!

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన సుమలత.. జాబ్ వచ్చాక డబ్బులు ఇస్తానంటే ఒప్పుకోకపోయేదట. ఇప్పుడు ఇస్తేనే మీకు ఉద్యోగం గ్యారంటీ అంటూ ముందస్తుగానే డబ్బులు వసూలు చేసుకునేదట. మహిళ నిరుద్యోగులు డబ్బులు లేవంటే.. నీ మెడలో పుస్తెలతాడు, బంగారు ఆభరణాలు ఉన్నాయిగా అంటూ వాటిని దగ్గరుండి అమ్మించి డబ్బులు పట్టుకెళ్లేదట. కొందరేమో అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ ఈ మాయలేడీ చేతిలో డబ్బులు కుమ్మరించారు. చివరకు ఐపీ పెట్టడంతో లబోదిబోమంటున్నారు. ఆ క్రమంలో బాధితులు కొందరు మంచిర్యాల డీసీపీని కలిసి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.

English summary
Mancherial District Bellampally Woman Sumalatha Cheated Un Employment Youth. She collected One Crore Above. At last she put an Insolvancy Petition. Victims approached mancherial DSP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X