మంచిర్యాలలో ఘోరం: పెళ్లైన కూతురు సహా కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య -అప్పులే భారం వల్లే?

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పెళ్లైన కూతురితోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలివి..

జిల్లాలోని జిల్లాలో కాసిపేట మండలం మల్కపల్లికి చెందిన రమేశ్ కు భార్య పద్మ, కూతురు సౌమ్య(19, కొడుకు అక్షయ్(17) ఉన్నారు. గురువారం ఉదయం ఇల్లంతా నిశబ్దంగా ఉండటంతో చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా, కుటుంబంమంతా విగత జీవులుగా కనిపించారు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Mancherial tragedy: four members of a family commits suicide with huge debts

ఒక గదిలో రమేశ్, ఆయన భార్య పద్మ ఉరి వేసుకోగా, మరో గదిలో వారి కొడుకు అక్షయ్‌, కూతురు సౌమ్య మృతదేహాలు కనిపించాయి. ఇప్పటికే పెళ్లయిన సౌమ్య ఇటీవలే అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డతో కలిసి కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది.

అందరితో కలివిడిగా ఉండే రమేశ్ కుటుంబం ఒక్కసారే ఇలాంటి తీవ్రనిర్ణయం తీసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే రమేశ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+