కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 20 మంది గాయాలు : డ్రైవర్ పరిస్థితి విషమం

మంచిర్యాల : జిల్లాలోని జైపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

rtc buss accident at mancherial, driver serious, 19 wounded

హతవిధి ...

చెన్నూరు నుంచి మంచిర్యాల వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మంది గాయపడగా .. 15 మందికి చిన్న గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

rtc buss accident at mancherial, driver serious, 19 wounded
rtc buss accident at mancherial, driver serious, 19 wounded

అయితే డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద బస్సు కల్వర్టుకు ఒరిగింది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు , ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. లేదంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు ఆరోపణలు ఇలా ఉంటే .. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+