500 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్: జహీరాబాద్ సర్కార్ దవాఖానలో ప్రారంభం: మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆదివారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు.
కరోనా సమయంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించామని.. లక్షణాలు ఉన్నవారికి కరోనా వైద్య కిట్లు పంపిణీ చేస్తున్న విషయాన్నీ గుర్తుచేశారు. సంగారెడ్డి, జాహీరాబాద్ ఆసుపత్రులలో సాధారణ డెలివరీ జరగడంపై ఆసుపత్రి వర్గాలను అభినందించారు. సాధారణ ప్రసవాల సంఖ్య 75 శాతం మేర పెరగాలని సూచించారు. అందులో భాగంగా జహీరాబాద్ లో 50 పడకల మాతాశిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సౌకర్యాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామని వివరించారు. జహీరాబాద్ ఆస్పత్రికి బ్లడ్ స్టోరేజీ సౌకర్యాన్ని లేదా బ్లడ్ బ్యాంక్ ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో రాష్ట వ్య్రాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
కరోనా మూడోదశ నుండి బయటపడితే ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు మరింత ముందుకు సాగుతాయని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె మానిక్ రావు, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.