నమ్మకంతో నయవంచన.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. 12 గంటలు రాక్షసక్రీడ
జగదేవ్‌పూర్ : నమ్మకం పేరుతో వంచిస్తున్నారు మాయగాళ్లు. ప్రేమ పేరుతో వల విసురుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తమను నమ్మి వచ్చే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘటన యువత పోకడలకు అద్దం పడుతోంది. 16 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్లీజ్, వదిలేయండంటూ మొత్తుకున్నా కనికరించలేదు. దాదాపు 12 గంటల పాటు రాక్షస క్రీడ కొనసాగించారు.
ఇటీవల ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తున్నాయి. గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువకులు అమాయక అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. తమను నమ్మేదాకా గుడ్‌బాయ్‌లా ప్రవర్తిస్తూ తీరా గ్రిప్ దొరికాక విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు.

రాక్షస మూక గ్యాంగ్ రేప్..!
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో దారుణం జరిగింది. రాయవరం గ్రామానికి చెందిన 16 ఏళ్ల దళిత బాలికను ఓ యువకుడు నమ్మించి మోసం చేశాడు. తనతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బుధవారం (15.05.2019) సాయంత్రం బైక్‌పై తీసుకెళ్లాడు. రాజీవ్ రహదారి సమీపానికి చేరుకున్న తర్వాత ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. తీరా వాళ్లు అక్కడికి చేరుకున్నాక.. ముగ్గురూ కలిసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఆ తర్వాత సదరు బాలికను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి నరకం చూపించారు.

ప్లీజ్, వదిలేయండి.. 12 గంటల నరక యాతన..!
స్నేహితుడే కదా అని నమ్మి వచ్చిన ఆ బాలికను చిత్రహింసలు పెట్టారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారేదాకా ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు విడిచి ఒకరు అతి దారుణంగా రేప్ చేశారు. ప్లీజ్, నన్ను వదిలేయండంటూ కాళ్లు మొక్కినా కూడా ఆ కర్కశ హృదయులు కనికరించలేదు. నిస్సహాయురాలిగా ఏమి చేయని పరిస్థితిలో బాలిక నరకయాతన అనుభవించింది.
మూర్ఖుల రాక్షసత్వానికి బాధ తట్టుకోలేక ఆ బాలిక కేకలు వేసినా విడిచిపెట్టలేదు. ఒళ్లు వాచేలా కొడుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బుధవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు రాక్షస క్రీడ కొనసాగించిన దుర్మార్గులు.. గురువారం నాడు ఉదయం రాజీవ్ రహదారి మీద పడేసి పారిపోయారు.

కేసు నమోదు.. నిందితుల కోసం గాలింపు
బాలిక కనపడటం లేదని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతికే పనిలో పడ్డారు. ఆ క్రమంలో రాజీవ్ రహదారి సమీపంలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న బాలిక కనిపించింది. కనీసం నిలబడలేని స్థితిలో సదరు బాలిక కనిపించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయడంతో జరిగిన దారుణం గురించి చెప్పుకొచ్చింది. దాంతో జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లోనూ అలాంటి దారుణం..!
ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. గంజాయికి అలవాటుపడిన కొందరు యువకులు ఓ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. బట్టలూడదీసి నగ్నంగా ఆమె ఫోటోలు చిత్రీకరించారు. రాయలేని పదజాలంతో దూషిస్తూ రాక్షాసానందం పొందారు. రాత్రంతా ఆ అమ్మాయికి నరకం చూపించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై బ్లేడుతో కోస్తూ అతి క్రూరంగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. జనాల్లో చైతన్యం లేకనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications