మహిళా కానిస్టేబుల్‌కు కూడా దిక్కులేదు.. హత్య చేసి, కాల్చేసిన ఉన్మాది.. వాడు కూడా కానిస్టేబులే..!
సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. హత్నూర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ప్రకాశ్ కంది మండల కేంద్రానికి చెందినవాడు కాగా.. రామచంద్రాపురం పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మందారిక మేకవనంపల్లికి చెందినవారు. అయితే వీరిద్దరు గతంలో సంగారెడ్డి పీఎస్ లో పనిచేసే క్రమంలో ప్రేమికులుగా మారారు.
ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్నప్పటికీ తమ ప్రేమను కొనసాగించారు. ఆ నేపథ్యంలో తరచుగా కలుసుకునేవారు. అదే క్రమంలో సోమవారం (29.04.2019) నాడు కూడా డ్యూటీలు అయిపోయాక వీరిద్దరు కలుసుకుని బయటకు వెళ్లారు. అయితే మందారిక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి రామచంద్రాపురం పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అక్కడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మందారికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

తన కారులోనే ఆమెను తీసుకెళ్లి కోనాపూర్ శివారులో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అంగీకరించాడు ప్రకాశ్. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య ఇటీవల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే మందారిక వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేక ప్రకాశ్ హత్యకు పాల్పడ్డాడనేది మరో వాదనగా వినిపిస్తోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications