మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిజానికి సంకెళ్లు, కంత్రీ క్రాంతి..అందోల్ సభలో షర్మిల నిప్పులు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఇవాళ జోగిపేట బస్టాండ్ వద్ద జరిగిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బహిరంగ సభ వేదిక మీద మాట్లాడారు. అందోల్ నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. మంజీర నీళ్ళు మన హక్కు అన్నారు.. 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను పక్కన పెట్టుకొని లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని.. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేక పోయారని మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు..కంత్రి కిరణ్ అని షర్మిల విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా కబ్జాలే..ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే అని అయిపోయిందన్నారు.దళితుడు అయి ఉండి చెరువులు,అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ నాన్న చెప్పిందే తాను గుర్తుచేశానని పేర్కొన్నారు. పండిత పుత్ర పరమ శుంఠ... కోడుకులు అంతా శుంఠలు అని స్వయంగా తండ్రి చెప్పాడన్నారు.

ys sharmila angry on cm kcr and mla kranti kiran

క్రాంతి కిరణ్ నాన్న ఒక రిటైర్డ్ టీచర్.. కొడుకులు కబ్జాలు చేస్తున్నారు అని సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. దళిత బిడ్డ అయ్యి ఉండి దళితుల హక్కుల కోసం ఏనాడైనా కొట్లాడారా అని అడిగారు. దళితుల పై దాడులు జరుగుతుంటే ఏనాడైనా ప్రశ్నించారా అని ఫైరయ్యారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనపై నోరు మెదపలేదన్నారు. దళితులకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇచ్చారని అడిగారు.ఎంత మందికి దళిత బందు ఇచ్చారని కొశ్చన్ చేశారు.ఎంత మందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారని ప్రశ్నించారు.

క్రాంతి కిరణ్‌కి దమ్ముంటే లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్.. జర్నలిస్ట్‌లకు సైతం న్యాయం చేయలేదన్నారు. ఈ పాలనలో విలువలేదు..గౌరవం లేదు..గుర్తింపు లేదని జర్నలిస్టులు తమ దృష్టికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జర్నలిస్ట్ అయి ఉండి జర్నలిస్ట్ కోసం న్యాయం చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ లను మోసం చేసిందన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని కాలనీలు కట్టిస్త అన్నారు.. ఎన్ని కాలనీలు కట్టించారు చెప్పాలని అడిగారు. కేసీఅర్ పాలనలో హెల్త్ కార్డ్‌లు అన్నారు...హెల్త్ స్కీమ్ అన్నారని గుర్తుచేశారు.నిమ్స్‌కి వెళ్తే కూడా హెల్త్ కార్డ్ పని చేయలేదన్నారు.

100 కోట్లు పెట్టి సంక్షేమ నిధి అన్నారు..ఏమయ్యిందని అడిగారు. నియోజక వర్గంలో వార్తలు రాస్తే 16 మంది ఉద్యోగాలు తీసివేశాడని ఆరోపించారు. అక్రమాల మీద వార్తలు రాస్తే 42 కేసులు పెట్టించాడని తెలిపారు. ఈయన కంత్రి ద్రోహి అని పేర్కొన్నారు.కేసీఅర్ పాలన లో జర్నలిజంకి సంకెళ్లు వేశారని తెలిపారు. సర్పంచ్‌ల భార్యలు తాళి బొట్లు అమ్మి పనులు చేసినందుకు మీరు అవార్డ్ తీసుకుంటున్నారా అని అడిగారు.

English summary
ysrtp chief ys sharmila angry on cm kcr and mla kranti kiran
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X