హవ్వ.. కుమారుడికి గన్‌మెన్‌ను కేటాయించిన జెడ్పీ చైర్మన్.. వీడియో వైరల్
అధికారం వ్యక్తులే చెలాయించాలి. భర్త/ కుమారులు దూరంగా ఉండాలి. చట్టాలు ఇలా చెబుతోన్న వాస్తవం మాత్రం వేరుగా ఉంది. పుత్రరత్నాలు అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. కారు, హోదా కూడా ప్రదర్శించేవారు. మరికొందరు అయితే ఏకంగా గన్ మెన్లను కూడా కేటాయిస్తూ విమర్శల పాలవుతున్నారు. సంగారెడ్డి జడ్పీ చైర్మన్ మజు శ్రీ రెడ్డి కూడా ఇలానే వ్యవహరించారు.
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్‌ను తనయుడు జయంత్ రెడ్డికి వినియోగిస్తుండటమే కారణమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంజుశ్రీ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

మంజు శ్రీ అయితే తన గన్ మెన్‌ను కుమారుడికి కేటాయించారు. కుమారుడిపై ఉన్న ప్రేమను చాటారు. కానీ విపక్షాలకు మాత్రం అస్త్రం దొరికింది. మంజు శ్రీ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం పని అని విమర్శలు చేస్తున్నారు. దీనికి మంజు శ్రీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications