Nalgonda: ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్‍లో ప్రసవించిన మహిళ..
ఓ గర్భణికి టాయిలెట్ లో డెలివరీ అయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నిడమనూరు మడంలం ధర్మాపురంకు చెందిన పార్వ తమ్మ అనే గర్భిణి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పార్వతమ్మ మొదటి సారి నార్మల్ డెలవరీ అయింది. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు
డెలివరీకి మరో వారం సమయం ఉందని చెప్పి బుధవారం ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. అయితే వైద్యుల చెప్పిన కొద్దిసేపటికి పార్వతమ్మ బాతురూమ్ కు వెళ్లింది. అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశువును ఐసీయూకు తరలించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ మాతాశిశు కేంద్రంలోని వార్డుకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు.

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ లో కట్టంగూరు మండలం చెర్వు అన్నారానికి చెందిన అఖిల అనే గర్భిణి డెలివరీ కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. రెండు రోజుల తర్వాత ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యలు విధుల్లో ఉన్న నర్సులకు చెప్పారు. కానీ నొప్పులు రాగానే కాన్పు చేయ్యాలా అంటూ నర్సులు బూతులు తిట్టారు.
బాధితురాలిని, ఆమె అత్తను బండబూతులు తిట్టి.. చివరికి బెడ్ వద్దకు వచ్చారు.
అత్త పూలమ్మ చూస్తుండగా అఖిలను నర్సులు అదిమిపట్టి, పొట్టపై నెట్టారు. దీంతో కడుపుపై ఒత్తిడి పెరిగి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చిన అఖిల ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్పటికీ ఆ నర్సులు పట్టించుకోలేదు. మళ్లీ మొబైల్ చూస్తూ టైం పాస్ చేశారు. అఖిల భర్త... ఆమె పరిస్థితిని గమనించి ఆస్పత్రి సూపరింటెండెంట్ లావుడి లచ్చునాయక్‌కు ఫోన్ చేశాడు.
ఆయన స్పందించి డ్యూటీ డాక్టర్‌కు ఫోన్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్యూటీ డాక్టర్ ఆమెను ఐసీయూలో చేర్చి.. చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగలేదు. చివరికి హైదరాబాద్ తరలించగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.












Click it and Unblock the Notifications