నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునుగోడు బై పోల్ హీట్: 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ, కేటీఆర్, హరీశ్ రోడ్ షో

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ హీటెక్కిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ ఇవాళ రెండు సెట్ల నామినేషన్ ఫైల్ చేశారు. 14వ తేదీన మరోసారి నామినేషన్ వేస్తారు. వచ్చేనెలలో ఎన్నిక జరగనుండగా.. ప్రచార పర్వంలో నేతలు మునిగిపోయారు. ప్రతీ వీధి, వాడలో ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఈ బైపోల్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్ఎస్ పేరుతో ఎన్నికకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు.

cm kcr conduct public meeting at 30th october

మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్యనేతలకు గ్రామాలు, మండలాల వారీగా ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్‌ కూడా మునుగోడు ఉప‌ఎన్నికలో ప్రచారం చేస్తారని తెలిసింది. ఈ నెల 30వ తేదీన చండూరు మండలం బంగారిగడ్డ వద్ద కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

30వ తేదీన బహిరంగ సభ కన్నా ముందు మరో బహిరంగ సభను నిర్వహించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీతోపాటు మునుగోడులో రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసమే అగ్రనేతలను మొహరించింది. హరీశ్ రావు ఎన్నికల పర్యవేక్షుడిగా పనిచేస్తున్నట్టు తెలిసింది.

English summary
telangana cm kcr conduct public meeting at 30th october. meeting at chundur mandal bangarigadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X