రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ​ఏం చేశారు: వైఎస్ షర్మిల

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. కేసీఆర్‌ను నమ్మి, రెండు సార్లు అధికారం ఇస్తే, ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో భాగంగా 32వ రోజు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రాయ‌గిరి గ్రామంలో పాద‌యాత్ర ప్రారంభించారు.
అక్క‌డి నుంచి యాద‌గిరి గుట్ట హైవే క్రాస్, బలంప‌ల్లి, కేసారం గ్రామాల మీదుగా పాద‌యాత్ర సాగింది. చొల్లేరు గ్రామంలో మాట ముచ్చ‌ట నిర్వ‌హించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఉద్యోగం లేక‌పోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తాన‌ని మోసం చేశాడు. పేదలకు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాన‌ని చెప్పి మోసం చేశాడు. మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని మోసం చేశాడు. రాష్ట్రంలో నాలుగు లక్షల అప్పులు చేసి, ఒక్కో కుటుంబంపై నాలుగు లక్ష అప్పు పెట్టారని పైరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారాయి. కేసీఆర్ ​ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మోసపూరిత హామీలు ఇస్తాడరని మండిపడ్డారు.

cm kcr what do the people in two terms:ys sharmila

మళ్లీ నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. డిగ్రీలు, పీజీలు చదివినోళ్లు బర్లు, గొర్లు కాస్తున్నరని.. ఇదీ దురదృష్టకరం అన్నారు. కేసీఆర్ తీరుతో టీ కొట్లతో పనిచేస్తున్నరు. కూరగాయాలు అమ్మే స్థాయికి దిగజార్చాడు. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లను కూలీలుగా మార్చి, అయిదారు చదివినోళ్లను మంత్రులను చేసిండు. ఇంటిల్లిపాదికి పదవులు అప్పగించి, ఫామ్ హౌజ్​లో పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. అభయహస్తం పథకాన్ని నడిపించే దమ్ము లేక కేసీఆర్‌‌ పైసల్ వాపస్​ఇస్తానంటున్నాడు. మహిళలకు బీమా కల్పించాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ మంచి పథకాన్ని ప్రవేశపెడితే.. కేసీఆర్ దానిని నీరు గార్చారని విరుచుకుపడ్డారు. తాము పోరాడితేనే 80వేల ఉద్యోగాలపై ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో నియంత పాల‌న పోవాలి.. వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న రావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+