కేసీఆర్ మాత్రమే నాయకుడు, ఇంకెవరు కాదు.. బూర నర్సయ్య సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీలో మునుగోడు హీటెక్కిస్తోంది. టికెట్ కోసం ఫైట్ తప్పడం లేదు. మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మధ్య పొసగడం లేదు. అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదని అంటున్నారు. టికెట్ ఆశించడమే నేను చేసిన తప్పా అని అన్నారు. మంత్రి లక్ష్యంగా ఫైర్ అవుతున్నారు.

కొందరు టీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానాలు అందడం లేదన్నారు. తనను ఆహ్వానించనంత మాత్రాన తన స్థాయి పడిపోదని చెప్పారు. తనను అవమానిస్తే మునుగోడు ప్రజలను అవమానించినట్టేనని అన్నారు.

ex trs mp bura narsaiah goud made sensational comments

అంతేకాదు ఒకడుగు ముందుకేసి కేసీఆర్ మాత్రమే నాయకుడని స్పష్టంచేశారు. ఆయన తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి ఇండెైరెక్టుగా కామెంట్స్ చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. మునుగోడు అసెంబ్లీ టికెట్ అడగడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.

నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్నిఅందజేస్తామని తెలిపారు. పార్టీకి చెందిన సమాచారం మాజీ ఎంపీకి ఎందుకు అందడం లేదో కనుక్కుంటామని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు జగదీశ్ రెడ్డి మొగ్గు చూపుతున్నారట. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం తెలిసి నర్సయ్య గౌడ్ ఫైర్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+