• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈజీగా హత్యలు , అత్యాచారాలు.. ఫేస్‌బుక్‌ నిండా అమ్మాయిలు.. శ్రీనివాస్ రెడ్డి రాక్షస జీవితం (వీడియో)

|

నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఎలాంటోడు. అమ్మాయిలను హతమారుస్తూ ఊరి ప్రజల మధ్య ఎలా తిరిగాడు. ఆ నరరూప రాక్షసుడి వ్యక్తిత్వమేంటి.. అసలు వాడి స్వభావమేంటి. గతంలో ఒక్కసారి ఓ మహిళను వేధిస్తే శ్రీనివాస్ రెడ్డిని కొట్టిన గ్రామ ప్రజలు.. తదనంతర కాలంలో అమ్మాయిలు మిస్సవుతుంటే వాడిని ఎందుకు అనుమానించలేదు. ఇలాంటి ప్రశ్నలకు ఒకటే సమాధానం. హత్యలు చేసిన తర్వాత సాధారణంగా నేరస్థులు పరారీలో ఉంటారు. అలాంటిది వీడు మాత్రం అదే గ్రామంలో తిరగడంతో ఎవరూ పెద్దగా అనుమానించలేదు. శ్రీనివాస్ రెడ్డి స్వతహాగా ఎవరితో కలిసిపోయేవాడు కాదనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. ఫ్రెండ్స్ తో బైక్ పై జాలీగా చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

<strong>ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణ</strong>ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణ

హత్యల తర్వాత హుషారు

అమాయకులైన బాలికలు, యువతులను అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుడు శ్రీనివాస్ రెడ్డి లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడూ ముభావంగా కనిపించే ఈ నరరూప రాక్షసుడు.. హత్యల అనంతరం చాలా హ్యాపీగా కనిపిస్తాడు. తాను నేరం చేసినట్లు దొరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఊరి ప్రజల మధ్యనే ఉంటూ అందరిలాగే తాను ప్రవర్తిస్తాడు. అయ్యో ఇలా జరిగిందా, అలా జరిగిందా అంటూ బాధపడినట్లు నటిస్తాడు.

శ్రావణి హత్య తర్వాత కూడా అలాగే ప్రవర్తించాడు. ఊళ్లోకి వచ్చి చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటే వాళ్లతో కలిసిపోయాడు. ఆ మరునాడే తన స్నేహితుడి పెళ్లి కోసం భువనగిరి వెళ్లి జాలీగా గడిపాడు. కొంతమంది స్నేహితులతో డ్యాన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే అంతవరకు ఎప్పుడూ చూసినా ఏదో కోల్పోయినట్లు ఉండే శ్రీనివాస్ రెడ్డి.. అంత హ్యాపీగా ఎందుకున్నాడో తమకు అర్థం కాలేదనేది ఫ్రెండ్స్ చెబుతున్న మాట. ఇలాంటి తరుణంలో కొందరు స్నేహితులతో బైక్ ల మీద ఎంజాయ్ చేస్తూ దూసుకెళుతున్న వీడియో ఒకటి వైరల్ కావడం చర్చానీయాంశమైంది.

 ఫేస్‌బుక్‌ దోస్తులంతా ఆడోళ్లే..!

ఫేస్‌బుక్‌ దోస్తులంతా ఆడోళ్లే..!

వృత్తిరీత్యా లిఫ్ట్ మెకానిక్‌ కావడంతో శ్రీనివాస్ రెడ్డి వివిధ ప్రాంతాలకు వెళతుండేవాడు. ఆ క్రమంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తరచుగా వెళ్లేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తీవ్ర నేర స్వభావమున్న ఈ నరరూప రాక్షసుడు.. ఆ ప్రాంతాల్లో కూడా ఏమైనా నేరాలు చేశాడేమోననే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డిని జ్యుడిషియల్ రిమాండుకు తరలించడంతో.. తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

ఎవరితోనూ సాధారణంగా కలిసిపోడనే పేరున్న శ్రీనివాస్ రెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతాలో 600 మందికి పైగా స్నేహితులున్నారు. అందులో 90 శాతం యువతులే ఉండటం గమనార్హం. వారంతా కూడా వివిధ ప్రాంతాలకు చెందినవారు. అలా ఆ పరిచయాలతో కూడా ఏమైనా నేరాలకు పాల్పడ్డడా అనే కోణంలోనూ పోలీసులు దృష్టి సారించారు.

 కస్టడీలోకి తీసుకుంటే..!

కస్టడీలోకి తీసుకుంటే..!

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది. శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్‌ డేటాతో పాటు ఫేస్‌బుక్‌ ఐడీని పోలీసులు నిశితంగా పరిశీలించనున్నారు. ఈ మానవ మృగం కేసును స్వయంగా రాచకొండ సీపీ పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఇంకెంతమంది బలయ్యారోనని.. వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Nalgonda District Bommala ramaram mandal hazipur village serial murders came into lime light. Serial killer srinivas reddy bike ride video viral in social media. He feels happy after murders and he will take precautions to escape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X