నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు దిక్కెవరు..? ఆత్మహత్య శరణ్య.. 11 నెలల చిన్నారితో ఎలా బతకాలి.. రేపిస్ట్ రాజు భార్య మౌనిక

|
Google Oneindia TeluguNews

రేపిస్ట్ రాజు చచ్చాడు. కానీ అతనికి ఓ ఫ్యామిలీ ఉంది. తల్లి, భార్య, చిన్నారి ఉంది. దీంతో తాము రోడ్డున పడ్డామని వారు అంటున్నారు. తమకు దిక్కేది అని వాపోతున్నారు. అంతేకాదు తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రాజు భార్య పల్లకొండ మౌనిక రోదించింది. తన భర్త ఆ పని చేశాడో లేదో తెలియదు.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడని పోలీసులు అతనిని చంపారు. బిడ్డ, అత్త సహా అనాథలు అయ్యామని బోరుమని విలపించింది.

దహనం అక్కడే..

దహనం అక్కడే..


మృతదేహాన్ని అడ్డగూడూరుకు పోలీసులు తీసుకురానివ్వకుంటే హన్మకొండలోనే దహన సంస్కారాలు నిర్వహించామని పేర్కొంది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇలానే చేశారా? అని ఆమె ప్రశ్నించారు. తన భర్తకు అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉందని, ఇతర ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. తమ కుటుంబానికి మగ దిక్కు లేకుండా పోయిందని వాపోయారు. తన 11 నెలల కుమార్తె ఎలా బతకాలి అని అడిగారు. ఇల్లును కూడా ధ్వంసం చేశారని.. ఎక్కడ ఉండాలని మౌనిక రోదించింది.

ఇలా జరిగింది..

ఇలా జరిగింది..

రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

Recommended Video

ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు రాజు కాదన్న సామాజిక కార్యకర్త దేవి!!
అతనే అని నిర్ధారణ

అతనే అని నిర్ధారణ

ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదీ ట్రైన్ కౌంటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో జ్యుడిషీయల్ విచారణకు ఆదేశించింది.

English summary
how we have lead a family after husband raju dead. Rapist raju wife mounika asked to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X