• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వృద్ధ దంపతుల దాతృత్వం... ప్రభుత్వం చేతికి కోటి రూపాయల భవనం

|

నల్గొండ : కన్నకొడుకులు కాదన్న వృద్ధులకు ఆసరాగా నిలిచారు. కాదుపొమ్మని అయినవారు తరిమేస్తే రోడ్డుమీద పడ్డ ముసళోల్లకు అండగా ఉన్నారు. ఇలా ఎంతోమంది వయసుమళ్లిన పెద్దోళ్లకు అన్నీ తామై వ్యవహరించారు ఆ దంపతులు. వృద్దాశ్రమం స్థాపించి సేవలందించారు. కాలక్రమంలో ఆ దంపతులు వృద్ధులుగా మారడంతో ఆశ్రమ నిర్వహణ కష్టంగా మారింది. దీంతో దాదాపు కోటి రూపాయల విలువైన భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు.

వృద్ధులకు అన్నీ తామై...

వృద్ధులకు అన్నీ తామై...

అయినవారు ఇంటినుంచి తరిమేస్తున్న వృద్ధుల బాధలు చూసి చలించిపోయారు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు. వారికోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన వీరు తమ సొంత స్థలంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. ఒకటిన్నర ఎకరంలో 6వేల చదరపు అడుగుల మేర భవనం నిర్మించారు.

అందులో చేరే వృద్ధులకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. వారికి ఎలాంటి లోటు రాకుండా సౌకర్యాలు కల్పించారు. అయితే కాలక్రమంలో ఆ దంపతులు వృద్ధులుగా మారడంతో ఆశ్రమ నిర్వహణ భారంగా మారింది. దీంతో ఆ బిల్డింగ్ సహా ఆశ్రమ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించాలని డిసైడయ్యారు. ఇన్నాళ్లు అక్కడ ఉండే వృద్ధుల ఆలనా పాలనా చూశారు. అయితే వయసు సహకరించకపోవడంతో ఆశ్రమ నిర్వహణను వదిలేస్తే తమను నమ్ముకున్న ఆ వృద్ధులు ఎక్కడ ఇబ్బందులు పడతారోనని కలత చెందారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేటీఆర్ తో భేటీ

ఆశ్రమ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వృద్ధ దంపతులు కలిశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను కలిసి విషయం వివరించారు. ఆ దంపతుల వినతిని కేటీఆర్ స్వీకరించడమే గాకుండా అభినందించారు. ఆశ్రమాన్ని ప్రభుత్వం టేకోవర్ చేసేలా చర్యలు తీసుకుంటామని.. ఈమేరకు యాదాద్రి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు.

దాతృత్వానికి అభినందనలు

దాతృత్వానికి అభినందనలు

అయినవాళ్లే కానివాళ్లుగా మారుతున్న ఈ రోజుల్లో వృద్ధులకు సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు కేటీఆర్. వృద్ధ దంపతుల నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. సొంత నిధులతో ఇన్నాళ్లు ఆశ్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఆ దంపతుల దాతృత్వం స్ఫూర్తినివ్వడమే గాకుండా మనసులు కదిలించేదిగా ఉందని పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An old couple was appreciated by TRS working president KTR for constructing a Old age home with their personal funds of Rs.1crore. Satyanarayana reddy and Janakamma from Yadadri met KTR and requested to maintain the old age home with government funds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more