• search
  • Live TV
నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?

|

నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పార్టీలు కింద మీద పడుతున్నాయి. అధికార పక్షమైన టీఆర్ఎస్.. అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అనే రీతిలో సై అంటే సై అంటున్నాయి. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన టీడీపీ ఈ ఒక్క సీటు కోసం ఒంటరిగా బరిలో నిలవడం గమనార్హం. అటు బీజేపీ కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయింది. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న హడావిడి కూడా బాగానే కనిపిస్తోంది. అదలావుంటే ఇండిపెండెంట్ల గుర్తులు ఆయా పార్టీలకు క్రాస్ ఓటింగ్ తంటాలు తెచ్చిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

హుజుర్‌నగర్ బరి.. వేడేక్కిందిగా మరి

హుజుర్‌నగర్ బరి.. వేడేక్కిందిగా మరి

హుజుర్‌నగర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ వేడి రాజుకుంటోంది. నేతల మాటల తూటాలతో ఈ ఒక్క ఉప ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నామినేషన్ల ఘట్టం ముగిసి ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ పరిణామాలు మరింత హీటెక్కాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నా.. టీడీపీ, బీజేపీ బరిలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇండిపెండెంట్ల సామర్థ్యం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే టాక్ నడుస్తోంది. అదలావుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కూడా ప్రచారంలో వేడి పెంచుతూ ముందుకెళ్లడం హుజుర్‌నగర్ ఉప ఎన్నిక మరింత ఉత్కంఠగా మారుతోంది.

దసరా వచ్చిందయ్యో, సరదా తెచ్చిందయ్యో.. జయహో దుర్గా భవాని.. ఊరూవాడా సంబురం

టీఆర్ఎస్ పట్టు.. గెలవాలనే తాపత్రయం

టీఆర్ఎస్ పట్టు.. గెలవాలనే తాపత్రయం

అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో బంపర్ మెజార్టీ సాధించిన గులాబీ దండు.. ఈ ఒక్క స్థానాన్ని జార విడుచుకునేందుకు నై అంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. హుజుర్‌నగర్ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రమంలో కీలక నేతలకు ఈ సెగ్మెంట్ గెలుపు బాధ్యతను అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా కీలక నేతలంతా హుజుర్‌నగర్ ప్రాంతంలో అడ్డా వేసి మరీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేటీఆర్ లాంటి నేతలు ఇదివరకే రోడ్‌షో లతో ప్రచారం హీటెక్కించారు.

కాంగ్రెస్ కంచుకోట.. గెలిచేదెట్టా?

కాంగ్రెస్ కంచుకోట.. గెలిచేదెట్టా?

కాంగ్రెస్ కంచుకోటలా మారిన హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానంపై ఆ పార్టీ పెద్దలు తమదే విజయమన్నట్లుగా గంపెడాశలు పెట్టుకున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన రోజే భారీ బహిరంగ సభ నిర్వహించడం స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇక జిల్లాలో పార్టీ నేతల మధ్య ఐక్యతారాగం వెల్లివిరుస్తోందనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచారనే వాదనలు లేకపోలేదు.

జిల్లాలో తమకంటూ ఓ క్రేజీ సృష్టించుకున్న కోమటిరెడ్డి కుటుంబీకులు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. అదలావుంటే మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దసరా పండుగ తర్వాత ప్రచారానికి రానుండటం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. అదలావుంటే బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మండలాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. అటు టీడీపీ కూడా తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

వ్యభిచారం రూట్ మారింది.. కోరుకున్న అమ్మాయిలు ఈజీగా.. మందుబాబులేమీ తక్కువ కాదుగా..!

స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో కన్ఫ్యూజనా?

స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో కన్ఫ్యూజనా?

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తున్నా.. టీడీపీ, బీజేపీతో పాటు ఇద్దరు ముగ్గురు బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగడంతో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఆ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నా.. ఓట్లు చీలే అవకాశం మాత్రం మెండుగా కనిపిస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో బయటపడతారే తప్ప.. భారీ ఓట్లతో విజయం సాధించడమన్నది కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదలావుంటే ఇండిపెండెంట్ల గుర్తులు ఆయా పార్టీల కొంప ముంచానున్నాయనే వాదనలున్నాయి. ఇదివరకు కారు గుర్తుకు దగ్గరగా ఉన్న రోడ్ రోలర్, ట్రక్కు, ట్రాక్టర్ నడిపే రైతు తదితర గుర్తులు టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పెట్టాయి. అయితే హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో కూడా ఇలాంటి తికమక, మకతికలు తప్పేట్టు లేదనే టాక్ నడుస్తోంది.

English summary
Telangana Politics were Interesting. Huzurnagar by elections 2019 will going hot topic. TRS and Congress Parties trying to won the Huzurnagar MLA Seat. TDP, BJP and some independent candidates also giving tough fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more