తిరుమల తరహాలో: శ్రీశైలం మల్లన్న ఆలయం సేవా టికెట్ల జారీలో కీలక మార్పులు
నంద్యాల: ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో సేవా టికెట్ల జారీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆలయంలో జారీ చేసే అన్ని రకాల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఇవ్వాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.
ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్‌లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25వ తేదీ నాడే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని బుక్ చేసుకోవడానికి భక్తులు www.srisailadevasthanam.orgను సందర్శించాల్సి ఉంటుంది.

ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇక 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు మాత్రం ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులు వాటిని పొందవచ్చు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లల్లో 30 శాతం ఆన్‌లైన్ బుకింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 70 శాతం టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు.
ఇక వారంలో నాలుగు రోజులు- అంటే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భ్రమరాంబ, మల్లికార్జునుడి ఉచిత స్పర్శ దర్శనం యధాతథంగా కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. సర్ప దోష నివారణ పూజ, అక్షరాభ్యాసం, అన్న ప్రాసన టికెట్లు సైతం కరెంట్ బుకింగ్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
దేవస్థానానికి వచ్చే ప్రముఖులు- తమ రాకను కనీసం 48 గంటల ముందు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే- వసతి గదుల కోసం వీఐపీలు జారీ చేసే సిఫారసు లేఖలను కూడా రెండు రోజుల ముందుగానే ఆలయ అధికారులకు పంపించాలి. ఈ లేఖలను [email protected] మెయిల్ ఐడీ లేదా ప్రొటోకాల్ ఫోన్ నంబర్ 9160016215కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications