కందుకూరు ఘటనపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే- చంద్రబాబు పేరెత్తకుండానే ! ఏ పార్టీకైనా ..
ఏపీలో నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది పార్టీ కార్యకర్తలు చనిపోయారు. దీంతో ఈ ఘటన అన్ని పార్టీల్లోనూ కలకలం రేపింది. దీనిపై రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
కందుకూరు ఘటనను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన తన సంతాపం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ తెలిపారు. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

కందుకూరు ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. దీనికి చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ఏర్పాట్లు సరిగా లేకపోవడమే కారణమన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న వైసీపీ ఇప్పటికే పోలీసుల సాయంతో కేసుల నమోదుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన పత్రికా ప్రకటనలో ఎక్కడా చంద్రబాబు పేరెత్తకుండానే సంతాపం ప్రకటించారు. కేవలం టీడీపీ పేరును మాత్రమే ఆయన ప్రస్తావించారు.
కందుకూరు ప్రమాదం దురదృష్టకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/uDY8UcJ3TA
— JanaSena Party (@JanaSenaParty) December 29, 2022












Click it and Unblock the Notifications