మానవతా దృక్పథంతో ఓటర్లకు డబ్బులు పంచాడట: అలాంటి ప్రొవిజన్ ఉందా?

Kakani Govardhan Reddy: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.

పోలింగ్ రోజు, ఆ తరువాతా అల్లర్లతో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, నెల్లూరు, చిత్తూరు జిల్లా చంద్రగిరిల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు దాడులు- ప్రతిదాడులకు దిగారు.

Minister Kakani Govardhan Reddy made key remarks against EC

ఈ ఘర్షణలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు టీడీపీపై మాటలదాడికి దిగారు. కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి పేర్ని నాని ఈ వ్యవహారంపై మాట్లాడారు. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటోన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పలు అనుమానాలను లేవనెత్తారు.

తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. నెల్లూరులో జరిగిన ఘర్షణలు, గొడవలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు.

ఈ మధ్యాహ్నం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరిగాయంటూ ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఎన్నికల అధికారులు.. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించారని, తమపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని ఆరోపించారు. వాళ్ల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మాచర్ల వంటి చోట్ల పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లను బయటికి లాగి, టీడీపీ నాయకులు దాడి చేశారని, రిగ్గింగ్‌కు పాల్పడినా ఎన్నికల అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని మంత్రి కాకాణి అన్నారు. తమపై దాడులు జరిగినప్పుడు తిరగబడిన తమ పార్టీ కార్యకర్తలపై కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టారని విమర్శించారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా ఓటర్లకు డబ్బులు పంచిన వీడియోను కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దీనిపై ఈసీ వివరణ కోరగా.. సోమిరెడ్డి మానవతా దృక్పథంతో ఓటర్లకు డబ్బులు పంచిపెట్టినట్లు తెలిపిందని కాకాణి అన్నారు.

ఎన్నికల సమయంలో ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు ఈసీ చెప్పడం సిగ్గుచేటు అని కాకాణి అన్నారు. ఈసీ నిబంధనల్లో ఎక్కడైనా అలాంటి ప్రొవిజన్ ఉందా? అని ప్రశ్నించారు. తోటపల్లి గూడూరులో వైసీీపీ నాయకులు డబ్బులు పంచినట్లు సమాచారం అందితే ఇదే జిల్లా ఎన్నికల అధికారి ఎస్ఐకి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+