Nellore: డబుల్ మర్డర్: ప్రధాన దోషికి ఉరి: మెడికో, ఆమె తల్లిని అత్యంత పాశవికంగా.. !

నెల్లూరు: రాష్ట్రంలో ప్రకంపనలను పుట్టించిన నెల్లూరు జిల్లా జంట హత్యల కేసులో స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మెడికో, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసిన కేసులో నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి గురువారం తీర్పు ఇచ్చారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి కారాగార శిక్షను విధించారు. వారిద్దరూ మైనర్లు కావడం వల్ల జువైనల్ హోమ్‌కు తరలించాలని ఆదేశించారు. హంతకుడి పేరు షేక్ ఇంతియాజ్.

 ఏమిటీ కేసు..?

ఏమిటీ కేసు..?


ఏడేళ్ల కిందట నెల్లూరు హరినాథపురంలో నివసించే దినకర్ రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవి దారుణ హత్యకు గురయ్యారు. 2013, ఫిబ్రవరి 12వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. నెల్లూరు శివార్లలో గల ఓ బీఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తోన్న దినకర్ రెడ్డి కుటుంబానికి షేక్ ఇంతియాజ్‌తో అంతకుముందే పరిచయం ఉండేది. వారు కొత్తగా కట్టిన ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి ఇంతియాజ్ తరచూ వెళ్లేవాడు.

ఆస్తిపై కన్నేసి..

ఆస్తిపై కన్నేసి..

దినకర్ రెడ్డి ఆస్తిపై కన్నేసిన ఇంతియాజ్.. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన స్నేహితులను వెంట బెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లాడు. సాధారణంగా- ఇంతియాజ్ వెళ్లిన సమయంలో శకుంతల ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చకోవాలని చూశాడు. ఇంట్లో ఎవరూ ఉండరనే ఉద్దేశంతో.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య జరిగిన రోజు దినకర్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్గవి కూడా ఇంట్లోనే ఉండటంతో ఇద్దర్నీ హతమార్చారు.

 స్థానికుల చేతుల్లో..

స్థానికుల చేతుల్లో..

శకుంతల, భార్గవి ఒంటి మీదున్న నగలు, బీరువాలోని ఇతర వస్తువులను దోచుకుని పరారయ్యే సమయంలో వారిని స్థానికులే పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఏడేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ హత్యాకండలో ఇంతియాజ్‌కు సహకరించిన ఇద్దరూ మైనర్లు కావడం వల్ల న్యాయస్థానం వారిని జువైనల్ చట్టాలకు లోబడి మూడేళ్ల గరిష్ఠ శిక్ష విధించింది. ఈ హత్యకు ఇంతియాజ్ సూత్రధారి కావడంతో.. అతనికి ఉరిశిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+