లారీ సడెన్ బ్రేక్‌తో ఢీ కొన్న కారు, వెనకాలే లారీ.. నుజ్జునుజ్జు, నలుగురి మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడురు జాతీయ రహదారిపై.. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు లారీలు కారును ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. వెంటనే వెనుక వస్తున్న మరో లారీ కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
తిరుమలలో శ్రీవారిని దైవదర్శనం చేసుకుని రాజమండ్రికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిలుగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

దైవ దర్శనం చేసుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో వారి ఇళ్లలో విషాధ చాయలు అలుముకున్నాయి. వారిని స్మరిస్తూ.. రోదనలతో మిన్నంటాయి. ప్రమాదంలో డ్రైవర్ తప్పు లేదని తెలుస్తోంది. లారీ డ్రైవర్ బ్రేకు వేయడంతో ఇలా జరిగింది. ఆ వెంటనే మరో లారీ రావడంతో కారులో ఉన్నవారికి చాన్స్ లేకుండా పోయింది. లేదంటే నలుగురు చనిపోయి ఉండేవారు కాదని.. స్థానికులు చెబుతున్నారు.
Recommended Video
ప్రమాదంతో ఆ స్థలం రక్తపుమడుగుగా మారింది. యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమని వైద్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications