నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.300 కోట్లు ఇవ్వండి, జెడ్పీటీసీకి రాజీనామా చేస్తా.. మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో ఇప్పుడు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సాధారణ సవాళ్లు కాక.. నియోజకవర్గానికి అంత ఇవ్వండి.. ఇంత ఇవ్వాలని కోరుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిని ఆద్యం పోయగా.. మిగతా నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. నియోజకవర్గం, మండలానికి ఇవ్వాలని కోరుతున్నారు. ఆ లిస్ట్‌లో రామారెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీ కూడా చేరారు. తన మండల పరిధికి నిధులు మంజూరు చేయాలని.. అలా అయితే రాజీనామా చేస్తానని ప్రకటించారు.

300 కోట్లు

300 కోట్లు


రామారెడ్డి మండలానికి రూ.300 కోట్లు ఇవ్వాలని మోహన్ రెడ్డి కోరారు. నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు తీసుకురావాలని కూడా ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను కోరారు. మండల పరిధికి మాత్రం మూడు వందల కోట్లు కావాలని అడిగారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. చిన్న రైతులతోపాటు.. కౌలు రైతులకు కూడా ప్రోత్సాహకం అందజేయాలని కోరారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయాలని కోరారు. వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ఇవ్వాలన్నారు.

ఇవీ డిమాండ్లు

ఇవీ డిమాండ్లు


రుణమాఫీ కూడా ఓకే సమయంలో చేయాలని మోహన్ రెడ్డి అన్నారు. భూమి లేని దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇవ్వాలని కోరారు. వీటిని నేర్చవేర్చడంతోపాటు... మండల అభివృద్దికి కూడా నిధులు ఇవ్వాలని షరతు విధించారు. అప్పుడే తాను పదవీకి రాజీనామా చేస్తానని వివరించారు.

పోటీ కూడా చేయ..

పోటీ కూడా చేయ..


రాజీనామా చేయడంతో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని హామీనిచ్చారు. ప్రకటనకు కట్టుబడి ఉంటానని మోహన్ రెడ్డి స్పస్టంచేశారు. తన రాజీనామాతో నిధులు వచ్చి.. ప్రజలకు మేలు జరిగితే చాలు అని చెప్పారు. మోహన్ రెడ్డి కామెంట్స్ చర్చనీయాంశం అయ్యింది. ప్రకటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.

English summary
allocate ramareddy mandal rs.300 crores zptc mohan reddy asked. if they allocate funds resign the zptc post he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X