నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ బిడ్డ ఫోన్ ట్యాప్ చేస్తలేర?: కవితకు అంత సీన్ లేదంటూ ధర్మపురి అరవింద్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేయడంపై, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. కవిత కులాహంకారంతో మాట్లాడుతోందన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులహంకారం పెరిగిపోయిందన్నారు.

కవిత.. ఇది దొరపాలన కాదంటూ అరవింద్

కవిత.. ఇది దొరపాలన కాదంటూ అరవింద్

తన ఇంట్లో విధ్వంసం సృష్టించడమే గాక, తన 70 ఏళ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు కవితకు ఎవరిచ్చారని అరవింద్ ప్రశ్నించారు. కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరపాలన కాదని చురకలంటించారు. రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థం చేసుకుంటానని అరవింద్ ఎద్దేవా చేశారు.

కవిత ప్రకటనను స్వాగతించిన ధర్మపురి అరవింద్

కవిత ప్రకటనను స్వాగతించిన ధర్మపురి అరవింద్

తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న కవిత ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు అరవింద్ తెలిపారు. కవిత తన అభ్యర్థనను మన్నించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఆమె తన మటపై నిలబడాలని ఆకాంక్షించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు అరవింద్ తెలిపారు.

కవితకు ఏక్‌నాథ్ అయ్యేంత సీన్ లేదన్న ధర్మపురి అరవింద్

అంతేగాక, ఏక్‌నాథ్ షిండే అయ్యేంత సీన్ ఎమ్మెల్సీ కవితకు లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ సినియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని.. ఆ మాటకు కట్టుబడి ఉంటానన్నారు.
తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే అది నిజమై ఉండొచ్చన్నారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్.. తన బిడ్డ కవిత కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అరవింద్ అన్నారు. తన బిడ్డకు బీజేపీవాళ్లు ఫోన్ చేశారని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అరవింద్ గుర్తు చేశారు.

కవితకు ధర్మపురి అరవింద్ సవాల్

తనకు కాంగ్రెస్ తోపాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్‌లో ఉన్నారని అరవింద్ తెలిపారు. రైతులను మోసగించేందుకు కేసు ఎదుర్కోవాలన్న కవిత వ్యాఖ్యలపై అరవింద్ స్పందించారు. ఏ కోర్టులో కేసు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసిన 178 మంది పసుపు రైతుల్లో 71 మంది బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా అరవింద్ గుర్తు చేశారు. 'మీ మేనిఫెస్టోలు మొత్తం చీటింగే.. రైతులు గుంపులు గుంపులుగా వచ్చి బీజేపీలో వచ్చి చేరుతుంటే నా మీద ఏం చీటింగ్ కేసు వేస్తావు' అని కవితను ప్రశ్నించారు అరవింద్. కవిత చెప్పిన స్టేట్‌మెంట్‌కు అంగీకరిస్తున్నానని, వచ్చి తనపై పోటీ చేయాలని అరవింద్ సవాల్ చేశారు.

English summary
BJP MP Dharmapuri Arvind slams Kavitha and KCR for his house attacked by trs workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X