నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో ఓటు వేయడం పెద్ద సహసమే ,పోటిలో 185 మంది అభ్యర్థులు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ లోక్ సభ స్థానానికి బ్యాలెట్ పేపర్లతో ఓటింగే నిర్వహించేందుకు రంగం సిద్దమైంది.ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. 63 నామినేషన్లకు మించి అభ్యర్థులు ఉంటే ఈవీఎం లతో ఓటింగ్ సాధ్యం కాదని తెలిపింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఏర్పాట్లు చేస్తామని ఈసి ఆధికారులు తెలిపారు.,దీంతో నిజామాద్ లో సీన్ మారింది, ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద సహసమే చేయాలి, భారీ జాబితాతో ఓటర్లకు సహనంతో వేచి ఉండాలి .

సీఎం కేసిఆర్ కు సోషల్ తలనోప్పి, పెరుగుతున్న రైతు ఫిర్యాదులు సీఎం కేసిఆర్ కు సోషల్ తలనోప్పి, పెరుగుతున్న రైతు ఫిర్యాదులు

నిజామాబాద్ లోక్ సభ బరిలో 185 అభ్యర్థులు,

నిజామాబాద్ లోక్ సభ బరిలో 185 అభ్యర్థులు,

నిజమాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయడంతో బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ఎలాంటీ ఇబ్బంది లేదని ఈసి ప్రకటిచింది.ఈవిఎమ్ ల ద్వార కేలవం 64 మంది అభ్యర్థులు మాత్రమే పోటిలో ఉన్నప్పుడు సాధ్యమని చెప్పింది. అభ్యర్థుల సంఖ్య 64 నోటాతో కలిపి మించితే ఈవీఎంలతో పోలీంగ్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా నిజామాద్ లో మొత్తం 185 మంది పోటిలో ఉన్నారని ఈసి వెల్లడించింది. రిటర్నింగ్ అధికారి నుండి సమాచారం అందగానే బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తామని పేర్కోంది.కాగా దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు కూడ రాశామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం తెలిపారు.

మద్దతు ధరల కోసం రైతుల ఆందోళన ,

మద్దతు ధరల కోసం రైతుల ఆందోళన ,

కాగా నిజామాద్ లో ఎర్రజోన్న, పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలని గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే,చాల రోజులుగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లపై వంటవార్పు కూడ నిర్వహించారు.దీంతో ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో రైతులు నేరుగా ఎన్నికల్లో పోటి చేయాలని నిర్ణయించారు,దీంతో 175 మంది రైతులు నామినేషన్ వేశారు. రైతులు బ్యాలెట్ పోరు ద్వార కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతొ నామినేషన్ వేశారు, కాగా నిజామాబాద్ బరిలో తెరాస, భాజపా,కాంగ్రెస్ ,జనసేన, పిరమిడ్ పార్టీ, తోపాటు బహుజన్ ముక్తి, తోపాటు 178 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా రైతులు పోటికి దిగారు.

ఓటు వేయడం ప్రహసనమేనా ?

ఓటు వేయడం ప్రహసనమేనా ?

ఇక 185 మంది అభ్యర్థులు ఉండడంతో బ్యాలట్ పేపర్ ఏస్థాయిలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి, సినిమా పోస్టర్ సైజుతో పాటు దినపత్రిక సైజులో ఉంటుందని పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఓటు వేసే వారికి అంత పెద్ద బ్యాలెట్ పేపర్ లో పార్టీ గుర్తులు చూసుకోవడం కూడ కొంత ఇబ్బందే. ఓటు వేయడంతో తోపాటు ఇచ్చిన బ్యాలెట్ పేపరు అదే స్థాయిలో మడత పెట్టి బాక్సులో వేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇక ఏ మాత్రం చినిగినా, రంగు ఇంకో గుర్తు పై పడినా ఆ మొత్తం ఓటు చెల్లకుండా పోయో పరిస్థితి కనిపిస్తోంది,మరోవైపు ఎన్నికల సంఘం ముద్రించనున్న గుర్తులు, అభ్యర్థుల ఫోటోలతోపాటు పేరు కూడ స్పష్టంగా ఉండాలి, లేదంటే ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంటుంది.దీంతో ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పినా కథ మొదటికి వస్తుంది. ఎన్నికలను సైతం వాయిదా వేయాల్సి వచ్చే అవకాశాలు కూడ ఉంటాయి. ఇక అంతా అనుకున్నట్టు సజావుగా ఎన్నికలు జరిగినా .. కౌంటింగ్ ప్రక్రియ సైతం ఆలస్యం అయ్యో అవకాశాలు ఉన్నాయి....ఇక ఫలితాలు సైతం అర్థరాత్రి తర్వాతే వెలువడనున్నాయి.

ఏంపీ కవితకు సమస్యా ?

ఏంపీ కవితకు సమస్యా ?

కాగా నిజమాబాద్ నుండి సిఎమ్ కేసిఆర్ కూతురు ఎంపీ కవిత తిరిగి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన వారు మద్దతు ధరల కోసం ఆందోళన చేసిన రైతులు .కాగా వీరి వెనక కాంగ్రెస్ హస్తం ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.దీంతో పలు గ్రామాల నుండి రైతులు నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన రైతులు , ఆయా గ్రామాల్లోని రైతులతొ ఓట్లు వేయించుకుంటారా లేక నామినేషన్ వరకే ఉంటారా అనేది వేచి చూడాలి. సో దీంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అభ్యర్థికి కోంత ఇబ్బంది కలిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవి కవిత గెలుపోటములను పెద్దగా ప్రభావితం చేయకున్న కోంత ఓటర్లుకు అటు ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది కల్గించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.

English summary
ballot paper VOTING in Nizamabad ; says EC ,With 185 candidates contesting for Nizamabad seat, the EC authorities are left with no option but to conduct the elections through ballot papers. the EVM can accommodate only 63 names
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X