నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇసుక మాఫియాపై సిట్టింగ్ జ‌డ్జీతో విచార‌ణ జ‌రిపించాలి: వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

మంజీరా న‌దిలో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల వ‌ల్ల ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని, బంధువుల‌ను ఇవాళ షర్మిల ప‌రామ‌ర్శించారు. మంజీరా న‌దిలో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం జుక్క‌ల్ మండ‌లం కండెబల్లూరు గ్రామంలోని బాలాజీ న‌గ‌ర్‌లో ద‌ళిత భేరి స‌భ‌లో పాల్గొని, ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందన్నారు. అధికార పార్టీ నేతలు అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌ను ప్రోత్స‌హిస్తూ కోట్లు దండుకుంటున్నారని ఫైరయ్యారు.

అక్రమ తవ్వకాలు..

అక్రమ తవ్వకాలు..

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వాగులు, న‌దుల‌ను తోడేస్తున్నారని షర్మిల విరుచుకుపడ్డారు. ప్ర‌మాద‌వ‌శాత్తు గుంత‌ల్లో ప‌డి, ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నా కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. మంజీరా న‌దిని అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు అడ్డాగా మార్చారని పేర్కొన్నారు. జుక్క‌ల్ నియోజ‌క‌వర్గంలో య‌థేచ్ఛ‌గా ఇసుక మాఫియా సాగుతోందని.. ఇక్క‌డ డంపులు వేసి, ఇసుకను మ‌హారాష్ట్ర, కర్ణాట‌క‌కు రవాణా చేస్తున్నారని వివరించారు. అయిదు మీట‌ర్లు మాత్ర‌మే త‌వ్వాల‌ని నిబంధ‌న ఉన్నా 15, 20 మీట‌ర్ల వ‌ర‌కు త‌వ్వుతున్నారని గుర్తుచేశారు. వానాకాలంలో లోతు తెలియ‌క ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు చ‌నిపోయారని గుర్తుచేశారు.

ఇసుక అక్రమ రవాణా

ఇసుక అక్రమ రవాణా

య‌థేచ్ఛ‌గా ఇసుక ర‌వాణా జ‌రుగుతున్నా పాల‌కులకు మాత్రం క‌నిపించ‌డం లేదన్నారు. పాల‌కులు దీనిని గుర్తించ‌డం లేదంటే ఎవ‌రెవ‌రికి ఎంతెంత ముడుతుందో ప్ర‌జ‌లు ఆలోచించాలని కోరారు. ట్రాన్స్ ఫ‌ర్ల‌కు, స‌స్పెన్ష‌న్‌ల‌కు భ‌య‌ప‌డి, మామూళ్ల మ‌త్తులో ఊగిపోతూ ఆఫీస‌ర్లు స్పందించ‌డం లేదన్నారు. జ‌నం ఇసుక రవాణాను అడ్డుకుంటే వారిపై పీడీ యాక్టు కేసులు పెట్టి, రౌడీ షీట్ ఓపెన్ చేసి, జైళ్ల‌లో పెడుతున్నారని పేర్కొన్నారు. ముందు, వెన‌కాల పోలీసు జీపులు పెట్టి ఇసుక ర‌వాణా చేస్తున్నారని షర్మిల అన్నారు. య‌థేచ్ఛ‌గా, విచ్చ‌ల‌విడిగా, ప‌ట్ట‌ప‌గలు, ఇసుక దోపిడీ జ‌రుగుతున్నా పాల‌కులు, అధికారులు ఏమీ చేయ‌డం లేదన్నారు. అధికారం అనుభ‌విస్తే స‌రిపోతుందా? ద‌ళితుల ప్రాణాలంటే లెక్క‌లేదా? ఇసుకను కాపాడే బాధ్యత కేసీఆర్ పై లేదా? భావి త‌రాల‌ను మీరు ఎలా కాపాడ‌తారు? బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ, దొంగల తెలంగాణగా మారుస్తున్నారని ఫైరయ్యారు.

దోచేస్తున్నారు..

దోచేస్తున్నారు..


తెలంగాణ సంప‌ద‌ను స్థానికుల‌కు అంద‌కుండా ఎమ్మెల్యే స్థాయి నుంచి కింద స్థాయి టీఆర్ఎస్ నాయ‌కుల వ‌ర‌కు దోచేస్తున్నారని పేర్కొన్నారు. ద‌ళితుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్క‌లేదన్నారు. ఇసుక మాఫియాపై వెంట‌నే సిట్టింట్ జ‌డ్జీతో విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మాఫియాలో ఎవ‌రెవ‌రు ఉన్నారు? ఎవ‌రికి ఎంత వాటా వెళ్తుంది? దోషులెవ‌రో తేల్చాలన్నారు. న‌లుగురు దళిత బిడ్డలు చనిపోతే కేసీఆర్ కు ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా? ఆ దళిత బిడ్డల ప్రాణం ఖరీదు 75 వేల రూపాయ‌లా? దళితుల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై లేదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రికి బాధ్యత గుర్తు చేయాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో, స్థానిక‌ ఎమ్మెల్యేల‌ క‌నుస‌న్న‌ల్లో ఇసుక దందా జ‌రుగుతోందన్నారు. అధికారులకు, టీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్నారు.

6 వేల ఎకరాల పోడు భూములు

6 వేల ఎకరాల పోడు భూములు

జుక్కల్ నియోజకవర్గంలో 6 వేల ఎక‌రాల పోడు భూములకు రాజశేఖర్ రెడ్డి పట్టాలు ఇస్తే, కేసీఆర్ వాటిని రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూముల సమస్యలు కుర్చీ వేసుకొని పరిష్కరిస్తామ‌నే కేసీఆర్‌కు ఇప్పుడు కుర్చీ దొరక లేదా? జుక్కల్ నియోజకవర్గంలో నాగమ‌డుగు లిఫ్ట్, కాట‌న్ మిల్లు, ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేదన్నారు. జుక్కల్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ప్రాజెక్టులు ఉన్నా.. ప్ర‌జ‌లు నీటి కోసం ఇబ్బందులు ప‌డుతున్నారని చెప్పారు. 70 శాతం ప్ర‌జ‌ల‌కు బ‌స్సు సౌక‌ర్యం లేదు, 50 శాతం గ్రామాల‌కు క‌నీసం స‌రైన రోడ్లు కూడా లేవన్నారు. ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్య సేవ‌లు అంద‌వు. పందులు, కుక్క‌లు తిరుగుతున్న‌ ఇక్క‌డి ఆస్ప‌త్రిలో ఎమ్మెల్యే వ‌చ్చి వైద్యం చేయించుకుంటాడా? ఇస్తామ‌న్న డ‌బుల్ బెడ్ రూం కూడా ఇవ్వ‌లేదన్నారు. అస‌లు ఏడేళ్లుగా ఏ అభివృద్ధి జ‌ర‌గ‌లేదని చెప్పారు. జుక్క‌ల్ ద‌ళిత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని అభివృద్ధి చేయ‌డం లేదా అని సీఎంను అడిగారు.

మోసం

మోసం

కేసీఆర్ ద‌ళితుల‌ను అన్ని ర‌కాలుగా మోసం చేశారని ఫైరయ్యారు. ద‌ళిత ముఖ్య‌మంత్రి నుంచి ద‌ళిత బంధు వ‌ర‌కు అన్నీ మోసాలేనని చెప్పారు. కేసీఆర్ పాలనలో దళితులకు అవమానాలే తప్ప గౌర‌వం లేదు.. ర‌క్ష‌ణ లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత‌ దళితులపై 8 వందల కేసులు నమోద‌య్యాయని చెప్పారు. నేరెళ్ళ ఘటనలో ఇసుక మాఫియా బాధితులను పోలీసులు బూటు కాలుతో తన్ని కేసులు నమోదు చేశారని చెప్పారు. ఆసిఫాబాద్‌లో దళిత మహిళ వేళ్లు నరికి చంపారని పేర్కొన్నారు. భువ‌న‌గిరిలో ఒక ద‌ళిత మ‌హిళ‌ను పోలీస్ స్టేష‌న్ లోనే కొట్టి చంపారని వివరించారు. రాష్ట్రంలో ద‌ళితుల‌పై ఇలాంటి దారుణాలు జరుగుతున్నా.. కేసీఆర్ స్పందించ‌రని వివరించారు.

Recommended Video

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిళ బీసి బహిరంగ సభ
మత్తులో ఉన్నారా..?

మత్తులో ఉన్నారా..?

కేసీఆర్ కళ్లు మూసుకుపోయాయా? లేక‌ మత్తులో ఉన్నారా? అని అడిగారు. వైఎస్ఆర్ ద‌ళితుల‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. విద్య, వైద్యం, ప‌క్కా ఇండ్లు, భూ పంపిణీతో సంక్షేమ పాల‌న అందించారని తెలిపారు. అస‌లు కేసీఆర్ ద‌ళితుల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారని అడిగారు. విద్యా వ్య‌వస్థ‌ను పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టించారని చెప్పారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిన‌ కేసీఆర్ హామీ నెర‌వేర్చుకోలేదన్నారు. దాన్ని కప్పిపుచ్చ‌డానికే ఉప ఎన్నిక‌లో కోసం దళిత బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారని వివరించారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడాల్సిన స‌మ‌యం వ‌చ్చిందన్నారు. ద‌ళితులంద‌రికీ తమ పార్టీ అండ‌గా ఉంటుందని.. ద‌ళితుల‌ సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం కోసం పార్టీ ఎల్లప్పుడూ ప‌ని చేస్తుందని వివరించారు.

English summary
want sitting judge inquiry ys sharmila on sand illigal transportation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X