ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్‌కు మరొకరు బలి, రూ.2 లక్షలు కట్టలేక సూసైడ్

|
Google Oneindia TeluguNews

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వల్ల అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. వాటి జోలికి వెళ్లొద్దు అని పేరంట్స్ చెప్పినా వినిపించుకోరు.. చివరకు ఇబ్బందుల పాలవుతారు. ప్రకాశం జిల్లాలో కూడా ఓ యువకుడు జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ పెట్టి యువకుడు నష్టపోయాడు. కానీ సదరు సంస్థ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరానికి చెందిన లింగాల చెన్నకృష్ణ ఆన్ లైన్ గేమింగ్ సంస్థకు రూ.2లక్షలు బకాయి ఉన్నాడు. బకాయి చెల్లించాలని ఆ సంస్థ వారు ఒత్తిడి చేశారు. కృష్ణ తల్లిదండ్రులు ఇప్పటివరకు రూ.లక్షా 60 వేలు చెల్లించారు. మిగతా రూ.40 వేలు కూడా చెల్లించాలని గేమ్ సంస్థ వాళ్లు యువకుడిని తీవ్రంగా వేధించారు.

another person suicide due to not pay online betting to rs.2 lakhs

బకాయి చెల్లించలేక, టార్చర్ తట్టుకోలేకపోయిన కృష్ణ మరో దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణ మృతితో అతడి కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ కొందరు వినడం లేదు. ఇలా చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా ఆన్ లైన్ గేమ్స్ జోలికెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా కృష్ణ కూడా అర్ధాంతరంగా చనిపోయాడు.

ఆన్ లైన్ గేమ్స్ గురించి, బెట్టింగుల గురించి.. ఓటీపీ చెప్పొద్దని పోలీసులు, నిపుణులు చెబుతుంటారు. కానీ కొందరు పెడచెవిన పెడతారు. వినకుండా గేమ్ ఆడి నష్టపోతుంటారు. వన్స్ లాస్ అయితే కంపెనీల నుంచి వేధింపులు మాములుగా ఉండవు. ఇదివరకు చాలా మంది అలానే సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కొందరు చనిపోయారు కూడా.. ఇలా కొందరివీ వెలుగులోకి వస్తున్నాయి. బయటకు రాకుండా... కుమిలిపోయేవారు కూడా చాలా మంది ఉంటారు.

English summary
lingala krishna suicide due to not pay online betting to rs.2 lakhs. incident happened at prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X