వైసీపీలో వర్గపోరు .. ఆమంచిపై ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యల మతలబు అదేనా !!
ఆంధ్రప్రదేశ్ లో చీరాలలో వైసీపీలో వర్గ పోరు కొనసాగుతూ ఉంది. గతంలో టీడీపీలో ఉన్న కరణం బలరాం, వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కరణం బలరాం ఏపీ సీఎం జగన్ కు మద్దతు తెలిపి,తన కుమారుడైన కరణం వెంకటేష్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేర్చిన తర్వాత వారి మధ్య విభేదాలకు చెక్ పడుతుంది అనుకుంటే అది నేటికీ ఇంకా కొనసాగుతుంది . కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య నేటికీ అంతర్గత యుద్ధం జరుగుతోంది.

జగన్ గాలి జోరుగా ఉన్నాటీడీపీ అభ్యర్థికి పట్టం కట్టింది అందుకే అన్న కరణం బలరాం
తాజాగా కరణం బలరాం ఆమంచి కృష్ణ మోహన్ ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ గాలిలోనే చీరాల ప్రజలు టిడిపి అభ్యర్థికి పట్టంకట్టారు అంటే అందుకు కారణం అవతలి వ్యక్తి పై ఉన్న వ్యతిరేకత అని అర్థం చేసుకోవాలని కరణం బలరాం , ఆమంచి కృష్ణ మోహన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు . అంతేకాదు చీరాల ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎవరో వచ్చి ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోం అని కరణం బలరాం హెచ్చరించారు.

ఓటెయ్యలేదన్న కోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం
ప్రజా ప్రతినిధుల వద్దకు పనుల కోసం వచ్చే వారితో సరిగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. తనకు ఓటు వేయలేదన్న కోపంతో కొంత మందిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు గుప్పించిన కరణం బలరాం, లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు . చీరాల ప్రజలకు ఎమ్మెల్యేగా తానున్నానని భరోసా ఇచ్చారు కరణం బలరాం.
గతంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కూడా ఆమంచి కృష్ణమోహన్ , కరణం బలరాం వర్గీయులు బాహాబాహీకి దిగారు. అప్పుడు కూడా కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.

ఇటీవల కరణం బలరాం తనయుడు వెంకటేష్ వార్నింగ్
చీరాల ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరి బెదిరింపులకు తాము భయపడమని కరణం వెంకటేష్ స్పష్టం చేశారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆనాడు ప్రమాణం చేశామని పేర్కొన్న ఆయన చీరాలలో గతంలో బెదిరింపులు, అరాచకాలు, ఉండేవని అవి ప్రస్తుతం తగ్గినట్లుగా పేర్కొన్నారు. చీరాల అభివృద్ధి కోసమే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లుగా గుర్తుచేశారు కరణం వెంకటేష్.
గతంలో కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వ్యాఖ్యలు, ఇక తాజాగా కరణం బలరాం వ్యాఖ్యలు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్ చేసి అన్నట్లుగా అర్థమౌతుంది .

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు .. చీరాలలో చర్చ
ఇంతకుముందు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న కారణంగా బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ తమ పంధా మార్చుకోవడం లేదు. ఇప్పటికీ పగలు, ప్రతీకారాలతో ఇరువురు నేతలు రగిలిపోతున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందంగా తాజా పరిస్థితి ఉండడం చీరాలలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
Recommended Video

ఇద్దరూ వైసీపీలోనే ... నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ..
ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా పంపించాలనే ప్రయత్నం కూడా జరిగినట్లుగా సమాచారం. ఏది ఏమైనా చీరాలలో వైసీపీలో కొనసాగుతున్న వర్గపోరు ముందు ముందు ఏ రూపు తీసుకుంటుందో అన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరి మధ్య సఖ్యత ఏర్పడదు అన్న భావన చీరాల వైసీపీ శ్రేణుల్లో కలుగుతుంది . మంత్రి బాలినేని ఎంత ప్రయత్నం చేసినా ఆమంచి , కరణం బలరాం వైసీపీ చేరినా సరే శత్రువుగానే చూస్తున్నారు . ఆధిపత్య పోరులో ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తలపడుతున్నారు .
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications