అర్ధరాత్రి నో పవర్: పెద్దాసుపత్రిలోనే కరెంట్ లేదు.. రోగుల ఇబ్బందులు
కరోనా కాలం.. దవాఖానకు పరుగులు తీయాల్సిందే. ఎమర్జెన్సీ అయితే అస్సలు ఆగొద్దు. నిరుపేదలు మాత్రం సర్కార్ దవాఖానకు నమ్ముకుంటారు. మరీ వారికి వేరే దిక్కులేదు. కొన్ని సందర్భాల్లో విచిత్ర పరిస్థితులు ఉంటాయి. నిన్న రాత్రి ఒంగోలు పెద్దాసుపత్రిలో కూడా అలాంటి సిచుయేషన్ ఫేస్ చేశారు. రోగులు, కరోనా రోగులు ఉండగా.. అర్ధరాత్రి కరెంట్ లేదు. దీంతో రోగుల ఇబ్బందులు మాములుగా లేవు కదా.. వర్ణణాతీతం అని వాపోయారు.
ఒంగోలు పట్టణానికి రిమ్స్ అతి పెద్ద ఆసుపత్రి. చాలా మంది రోగులు వస్తుంటారు. ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి దవాఖానలో కరెంట్ సమప్య ఏర్పడింది. అకస్మాత్తుగా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులకు టార్చ్ లైట్ల సహాయంతో చికిత్స చేశారు.

రోగులే కాదు కరోనా వైరస్ సోకిన వారు కూడా ఇక్కడ ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు సుమారు 200 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుత్ సమస్యతో రోగులు, వైద్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎమర్జెన్సీ చికిత్స కోసం వస్తే ఇలా జరిగిందని వాపోయారు. కరెంట్ లేకుంటే చీకట్లో వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications