Bulk Drug Park: బల్క్ డ్రగ్ పార్క్ వద్దు- కేంద్రానికి టీడీపీ నేత యనమల లేఖ-షాకింగ్ రీజన్స్

కాకినాడ : కాకినాడ జిల్లా తొండంగి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల్ని ప్రోత్సాహించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని దక్కించుకునేందుకు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడినా కేంద్రం మాత్రం ఏపీకే కేటాయించింది. అయితే ఈ పార్క్ వద్దంటూ కేంద్రానికి ఇవాళ టీడీపీ లేఖ రాసింది.

కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్

కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్

ఆంధ్రప్రదేశ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీ)ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సమాచారం పంపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపాలని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో కోరింది.

 బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ లేఖ

బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ టీడీపీ లేఖ

కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ టీడీపీ ఇవాళ కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత, స్ధానికుడు కూడా అయిన యనమల రామకృష్ణుడు సంబంధిత జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ రాకతో కాకినాడ జిల్లాలో చోటు చేసుకోబోయే పరిణామాల్ని ఆయన ఇందులో ప్రస్తావించారు. దీంతో ఈ పార్క్ కేటాయింపు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

యనమల లేఖలో

యనమల లేఖలో

కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు దీని వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం జీఎంఆర్ సెజ్ కు కేటాయించిన భూములు, అనంతరం వాటిని వైసీపీ ప్రభుత్వం అరబిందో సెజ్ కు ఇచ్చిన వైనం, రైతుల అభ్యంతరాలు, ఆ తర్వాత సెజ్ కాస్తా బల్క్ డ్రగ్ పార్క్ గా మారిన వైనాన్ని యనమల సమగ్రంగా వివరించారు. అంతే కాదు ఈ డ్రగ్ పార్క్ ఏర్పాటు వల్ల స్ధానికులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని ఆయన ప్రస్తావించారు.

 కాలుష్య కారక పరిశ్రమ వల్ల నష్టాలివే..

కాలుష్య కారక పరిశ్రమ వల్ల నష్టాలివే..

అరబిందో సెజ్ లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటు వల్ల నీటి కాలుష్యం, నేల కాలుష్యం, వాయు కాలుష్యం, సముద్ర కాలుష్యం వంటి వాటితో పాటు రైతులు, మత్స్యకారులు, వారి జీవనోపాధికి హానికరం కాబోతోందని యనమల హెచ్చరించారు. ఫార్మా ఉత్పత్తులు పర్యావరణంలోకి చేరడం వల్ల జంతువులు, ముఖ్యంగా చేపలు నీరు, గాలి కలుషితమై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ముఖ్యంగా కోన ప్రాంతంలో దాదాపు 50 వేల మంది ప్రజలు, వెయ్యి ఎకరాల సాగు భూమి ప్రభావితమై ఆహార ఉత్పత్తికి తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే ఎన్జీటీతో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి లేఖలు రాశామన్నారు. ఫార్మా ఉత్పత్తుల ప్రతికూల ప్రభావాల్లో వికారం, మలబద్ధకం, అతిసారం, మగత, నొప్పి, చర్మ ప్రతిచర్యలు జీర్ణశయాంతర సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో ఇలాంటి కారణాలతోనే విశాఖ జిల్లా నక్కపల్లిలో హెటిరో డ్రగ్స్ కు ఎన్జీటీ 6.94 కోట్ల జరిమానా విధించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+