వివాదంలో ధోనీ భార్య సాక్షి: భర్తకు సపోర్ట్: అంపైర్లపై ఫైర్: టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలట

షార్జా: ఐసీఎల్-2020 సీజన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. రెండు జట్లూ కొదమసింహాల్లా కలబడ్డాయి. ప్రత్యర్థి ఉంచిన భారీ లక్ష్యాన్నిఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చివరికంటా పోరాడింది. చివరి బంతి వరకూ ప్రతిఘటించింది. బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగిస్తాడని ఆశించినప్పటికీ.. సాధ్యం కాలేదు. 16 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓడిపోయింది.

సాక్షి ట్వీట్‌పై వివాదాలు..

సాక్షి ట్వీట్‌పై వివాదాలు..

మ్యాచ్ సంగతి అలా వుంటే.. ధోనీ భార్య సాక్షి వివాదాల్లో చిక్కుకున్నారు. అంపైర్ల నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆమె చేసిన ఓ ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆమె దాన్ని డిలెట్ చేసినప్పటికీ.. లేట్ అయింది. ఆ ట్వీట్ స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంపైర్లకు హితబోధ చేస్తూ సాక్షి పెట్టిన పోస్ట్ అది. టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలంటూ ఆమె అంపైర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అవుట్ అంటే అవుటేననీ తీర్పూ ఇచ్చారు. ఇది కాస్తా నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. వివాదాలను రేపింది. ప్రస్తుతం ఆమె రాంచీలో ఉన్నారు.

 టామ్ కుర్రమ్ అవుట్‌పై

టామ్ కుర్రమ్ అవుట్‌పై

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్ టామ్ కుర్రమ్ అవుట్‌పై గందరగోళం చోటు చేసుకున్న సందర్భాన్ని ఉద్దేశించి సాక్షి ఈ ట్వీట్ చేశారు. ఇన్నింగ్ 18వ ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ వేసిన ఓ షార్ట్ డెలివరీని షాట్ ఆడటానికి ప్రయత్నించాడు టామ్ కుర్రమ్. షాట్ మిస్ అయ్యాడు. ఆ బాల్.. టామ్ ప్యాడ్లను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ ధోనీ గ్లోవ్స్‌లో వాలింది. దీన్ని అవుట్‌గా ప్రకటించారు అంపైర్. డీఆర్ఎస్ అవకాశం కూడా లేకపోవడంతో టామ్ పెవిలియన్‌కు వెనుదిరిగాడు.

డెసిషన్ వెనక్కి

డెసిషన్ వెనక్కి

నిజానికి- ఆ బాల్ టామ్ బ్యాట్‌ను తాకలేదు. పైగా గ్రౌండ్‌పై పిచ్ పడి లేచిన తరువాత ధోనీ దాన్ని క్యాచ్ పట్టాడనేది రీప్లేలో స్పష్టంగా కనిపించింది. స్టేడియంలో అమర్చిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై దీన్ని గమనించిన అంపైర్లు రీకాల్ చేశారు. ప్యాడ్‌ను తాకడం వల్ల దాన్ని ఎల్బీడబ్ల్యూగా కూడా పరిగణించలేదు. టామ్ అవుట్ అయినట్లు ఇచ్చిన డెసిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీనితో మ్యాచ్‌లో కొంత గందరగోళం నెలకొంది. ధోనీ అంపైర్లతో మాట్లాడుతూ కనిపించాడు. అంపైర్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో టామ్ కుర్రమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. మ్యాచ్ కంటిన్యూ చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు.

తప్పుపట్టిన సాక్షి..

తప్పుపట్టిన సాక్షి..


ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ సాక్షి ధోనీ తప్పుపట్టారు. అంపైర్ల నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. అవుట్ అంటే అవుటేననీ పేర్కొన్నారు. దాన్ని ఎలా వెనక్కి తీసుకోగలరనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితే వస్తే.. దాన్ని సక్రమంగా వాడుకోవాలని సూచించారు. క్యాచ్ పట్టినా, ఎల్బీడబ్ల్యూ అయినా అవుట్ అంటే అవుటేనని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌పై వివాదాలు రావడంతో ఆమె దాన్ని డిలేట్ చేశారు. అప్పటికే ఆలస్యమైంది. ఈ ట్వీట్ స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+