ఓ కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు .. నీ పెద్దమనసు అందరికీ ఆదర్శమని కితాబు
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ కానిస్టేబుల్ చేసిన మంచి పనికి ఫిదా అయ్యాడు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది అంటూ ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలంలో అత్యంత సాహసోపేతంగా ఫ్రంట్లైన్ వారియర్ గా పని చేసిన కానిస్టేబుల్ విధి నిర్వహణలోనే కాదు, కరోనా బాధితుల ప్రాణాలను కాపాడటం లో కూడా ఫ్రంట్ లైన్ లోనే ఉన్నారంటూ కితాబు ఇచ్చారు.
ఇంతకీ ఆ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేశారంటే.. సిద్దిపేట జిల్లా, రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ విధి నిర్వహణలో భాగంగా కరోనా కష్ట కాలంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. కరోనా కోలుకున్న తర్వాత కానిస్టేబుల్ చంద్రశేఖర్ కరోనాతో బాధపడుతున్న వారి ప్రాణాలు కాపాడడం కోసం ప్లాస్మాదానం చేశారు. అది ఒకసారి అయితే పర్వాలేదు, కానీ ఆయన ఏకంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్లాస్మా దానం చేశారు.

ఈ విషయం తెలిసిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు అభినందనలు తెలియజేశారు. కరోనాను గెలవడమే కాకుండా ప్లాస్మా దానం చేసి అందరి మనసులు గెలిచావ్ అంటూ పేర్కొన్నారు. మూడు సార్లు ప్లాస్మా దానం చేసిన నీ పెద్ద మనసు అందరికీ ఆదర్శమంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కరోనా పట్ల అవగాహన నీ లాంటి యువకులు కలిగించాలని, అపోహలు నీలాంటి యువకులే తొలగించాలంటూ పేర్కొన్నారు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది అంటూ మంత్రి హరీష్ రావు కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను ప్రశంసించారు.
తెలంగాణా రాష్ట్రంలో కరోనా బారిన పది సీరియస్ గా ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి ప్లాస్మా థెరపీ అందిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రాణాపాయం నుండి బయట పడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణా పోలీస్ శాఖ కూడా ప్లాస్మా దానానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. పోలీస్ శాఖలోనూ వేల సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడుతున్నా,అవేవీ లెక్క చెయ్యకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదంతా ఒక ఎత్తయితే కొందరు పోలీసులు ప్లాస్మా దానం కూడా చేస్తూ ఇతరుల ప్రాణ రక్షణలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు .
Recommended Video
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications