రేవంత్-కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణలోకి చంద్రబాబు: ఓటుకు నోటంటూ హరీశ్ తీవ్ర విమర్శలు

సిద్దిపేట: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని అన్నారు. చంద్రబాబు తన మనుషులకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇప్పిస్తున్నారని చెప్పారు.

అప్పుడు ఆంధ్రబాబు అని వెళ్లగొడితే..

అప్పుడు ఆంధ్రబాబు అని వెళ్లగొడితే..

చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని హరీశ్ రావు అన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని.. తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి పంపి తెలంగాణలో అడుగుపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు నిందితుడు కాదా? బాబుకు సన్నిహితుడు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు నిందితుడు కాదా? బాబుకు సన్నిహితుడు


రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితుడు కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా వచ్చాడన్నారు. టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాకే.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీరు వస్తున్నాయని చెప్పారు. 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలో టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసి చూపిందన్నారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పర్యటించారు.

ఏఢేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదన్న హరీశ్ రావు

ఏఢేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదన్న హరీశ్ రావు


కల్లెపల్లిలో గ్రామ మహిళ సమాఖ్య భవనాన్ని, అంబేద్కర్ భవనాన్ని, రైతు నివేదికను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్జంకి తరపున రూ. 80 వేల విలువ కలిగిన బాడీ ఫ్రీజర్ శవపేటికను కల్లెపల్లి గ్రామ పంచాయతీకి అందజేశారు. క్లబ్ సభ్యులైన మోహన్, రవీంద్రప్రసాద్ లను ఈ సందర్భంగా మంత్రి హరీశ్, రసమయి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. రైతు బంధుతో నేరుగా డబ్బులు ఖాతాలోనే జమవుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఏడేళ్లలో బీజేపీ చేసేందేమీ లేదని అన్నారు.

కేసీఆర్‌ను వదులకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు..

కేసీఆర్‌ను వదులకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు..


మరో టీఎర్ఎస్ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని, వారి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అలాంటి నాయకులను నమ్మరని అన్నారు. సూర్యపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను వదులుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పైరవీలతో పదవులు రావొచ్చు కానీ.. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి జగదీశ్ రెడ్డి పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం కర్రుకాల్చి వాత పెడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+