ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఎచ్చెర్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సిగడాం మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. ఈ నియోజకవర్గం 2009 నుండి జనరల్ స్థానంగా మారింది. ప్రస్తత టిడిపి ఏపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఇదే నియోజకవర్గం నుండి 2009 లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి , ప్రస్తుత ఎమ్మెల్సీ ఇక్కడి నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో ఇక్కడి నుండి పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కోండ్రు మురళీ మోహన్ ఆ తరువాత 2009 లో రాజాం నుండి గెలిచారు. ఆయ న ప్రస్తుతం టిడిపిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఓడిన కళా వెంకటరావు ఆ తరువాత తిరిగి టిడిపి లో చేరారు. 2014 ఎన్నిక ల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసారు. ప్రస్తుతం ఏపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
11 సార్లు ఎన్నికలు..
ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1967 నుండి ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నుండి నాలుగు సార్లు, టిడిపి ఆరు సార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి గెలిచిన ఆరు సార్లలో అయిదు సార్లు ప్రతిభా భారతి, ఒక సారి కళా వెం కటరావు గెలుపొందారు. ఇక సారి స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1962 లో పొందూరు నియోజకవర్గంగా ఉండగా,అంతకు ముందు 1955 నుండి 1962 వరకు షేర్ మహమ్మద్ పురంగా ఉండేది. ఇక, 1967 నుండి రిజర్వ్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం నుండి గెలిచిన నేతల్లో ప్రతిభా భారతి స్పీకర్ కాగా, మురళీ మోహన్ విప్, మంత్రిగా పని చేసారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 210400 ఓటర్లు ఉండగా, అందులో 173147 ఓటు హక్కు వినియోగించుకు న్నారు. టిడిపి నుండి పోటీ చేసిన కళా వెంకటరావు కు 85769 ఓట్లు దక్కగా, వైసిపి నుండి పోటీ చేసిన కిరణ్ కుమార్ కు 81028 ఓట్లు వచ్చాయి. కళా వెంకటరావు 4741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన తరువాత గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కళా వెంకటరావు మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రి పదవితో పాటుగా ఏపి రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications