ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మంద‌స‌, ప‌లాస‌, వ‌జ్ర‌పుకొత్తూరు మండ‌లాలు పూర్తిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం లో చేరాయి. ప్ర‌ముఖ నేత గౌతు ల‌చ్చ‌న్న ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 1952 నుండి ఇక్క‌డ గౌతు కుటుంబం..మ‌జ్జి కుటుంబం గెలుస్తూ వ‌చ్చింది. గౌతు ల‌చ్చ‌న్న కుమారుడు శ్యాం సుంద‌ర శివాజీ ఇక్క‌డ నుండి ఆరు సార్లు గెలిచారు. గౌతు ల‌చ్చ‌న్న‌, గౌతు శ్యాం సుంద‌ర శివాజీలు మంత్రులుగా ప‌ని చేసారు. గౌతు ల‌చ్చ‌న్న రాష్ట్రం ఏర్పాటు స‌మ‌యంలో పెద్ద‌మ‌నుషుల ఒప్పదం పై సంత‌కం చేసిన ప్ర‌ముఖుడు. కీల‌క వ్య‌క్తిగా ఉన్న గౌతు ల‌చ్చ‌న్న 1983 లో సోంపేట నుండి 1985 లో శ్రీకాకుళం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల పున ర్విభ‌న త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014 నాటికి ఇక్క‌డి స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి.

14 సార్లు ఎన్నిక‌లు...రెండు కుటుంబాలే అధికంగా..
సోంపేట నియోజ‌క‌వ‌ర్గంలో 2004 వ‌ర‌కు 12 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అందులో రెండు సార్లు మాత్ర‌మే కాంగ్రెస్ గెలిచింది. టిడిపి నాలుగు సార్లు గెలిచింది. గౌతు ల‌ఛ్చ‌న్న కెఎల్పి నుండి రెండు సార్లు... స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా రెండు సార్లు గెలిచారు . ఆయ‌న త‌న‌యుడు శ్యాం సుంద‌ర్ శివాజీ టిడిపి నుండి నాలుగు సార్లు..స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా ఒకసారి గెలుపొందారు. ఇక‌, 2009 లో ఏర్ప‌డిన ప‌లాస నియోజ‌క‌వర్గంలో 2009 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి జుత్తు జ‌గ‌న్నాయ‌కులు చేతిలో టిడిపి నుండి పోటీ చేసిన గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ ఓడిపోయారు. అదే ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం సైతం త‌న స‌త్తా చాటు కొనే ప్ర‌య‌త్నం చేసింది.

#AndhraPradeshElections2019: All about Palasa Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..
2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 190925 ఓట‌ర్లు ఉండ‌గా, అందులో 186566 ఓట్లు పోల‌య్యా యి. టిడిపి నుండి పోటీ చేసిన గౌతు శ్యాం సుంద‌ర శివాజీకి 53668 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన బాబూరావు కు 52188 ఓట్లు వ‌చ్చాయి. ఆరు సార్లు గెలిచిన సీనియ‌ర్ ఎమ్మెల్యేగా త‌న‌కు టిడిపి ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద ని శివాజీ భావించారు. అయితే ఇదే జిల్లా నుండి తొలి విడ‌త లో అచ్చంనాయుడు, రెండో విడ‌త‌లో కళా వెంక‌ట‌రావు లు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. అదే స‌మ‌యంలో ప‌లు సంద‌ర్భాల్లో శివాజీ త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేదంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+