ఏ పార్టీలో ఉన్నా.. నా గొంతుక నాదే: తేల్చేసిన మంత్రి ధర్మాన

శ్రీ‌కాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతష్ఠాత్మకంగా భావిస్తోన్న శ్రీకాకుళం జిల్లా భావనపాడు సీ పోర్ట్ నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం అందుతోంది. మొద‌టి విడ‌త‌లో భూములు ఇచ్చిన రైతుల‌కు రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, మత్స్య సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిహారాన్ని చెల్లించారు. చెక్కులను పంపిణీ చేశారు.

ఒక్కో ఎకరానికి పాతిక లక్షలు..

ఒక్కో ఎకరానికి పాతిక లక్షలు..

ఒక్కో ఎకరానికి పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ప‌రిహారాన్ని అందించారు మంత్రులు. భ‌విష్య‌త్‌ లో రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఓ భారీ ప్రాజెక్టుకు భూమిని ఇచ్చిన ఘనత జిల్లా రైతులకు దక్కుతుందని అన్నారు. అనేక వనరులు ఉన్నప్పటికీ.. శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవ‌న ప్ర‌మాణాల విషయంలో వెనుక‌బ‌డే ఉందని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. గత పాల‌కుల నిర్లక్ష్యం వ‌ల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఆ ఆవేద‌న తనకు ఎప్పుడూ ఉంటుదని వ్యాఖ్యానించారు.

ఏ పార్టీలో ఉన్నా..

జిల్లా స్థితిగతులు, ప్రజల జీవన ప్రమాణాలు, అభివృద్ధి.. వంటి విషయాలపై ఏ పార్టీలో ఉన్నా గానీ తన గొంతుక వినిపిస్తూనే ఉంటుందని ధర్మాన ప్రసాద రావు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తాను న‌మ్మిన‌ అంశాలపైనే మాట్లాడుతూ వస్తోన్నానని, దీన్నే కొనసాగిస్తాననీ పేర్కొన్నారాయన. ఇప్పుడు వైసీపీ సారథ్యంలోని తమ ప్రభుత్వం శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా అనేక నిర్ణయాలను తీసుకుంటోందని, వాటిని అమలు చేస్తోందనీ అన్నారు.

రూ.3 వేల కోట్లతో..

రూ.3 వేల కోట్లతో..

జిల్లాలో 3,000 కోట్ల రూపాయ‌ల‌తో వ్యయంతో తమ ప్రభుత్వం చేపట్టిన భావనపాడు పోర్ట్ నిర్మాణం.. జిల్లా అభివృద్ధికి దోహ‌దం చేస్తుందని అన్నారు. దీని వల్ల పలు ప‌రిశ్ర‌మ‌లు జిల్లాకు వస్తాయని, ఈ ప్రాంతం రూపు రేఖలన్నీ మారిపోతాయని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. పోర్టు కార‌ణంగా వ‌చ్చే అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల వల్ల స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా దొరుకుతాయని అన్నారు. దీనికి అనుగుణంగా త‌ల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని, ఎక్క‌డా రాజీ ప‌డొద్దని అన్నారు.

కేంద్ర మంత్రి గానీ, ఎంపీ గానీ ఏం చేశారు..

కేంద్ర మంత్రి గానీ, ఎంపీ గానీ ఏం చేశారు..

గతంలో ఈ ప్రాంతం నుంచి కేంద్రమంత్రిగా పని చేసిన నాయకుడు గానీ, ఇప్పుడున్న ఎంపీ గానీ జిల్లాకు ఏం చేశారో వివరించాలని ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం 23 సంస్థ‌లను రాష్ట్రానికి కేటాయిస్తే అందులో ఒక్క‌టి కూడా శ్రీకాకుళం జిల్లాకు దక్కలేదని చెప్పారు. చంద్ర‌బాబుకు ఈ జిల్లా అంటే ప్రేమ లేదని, నిర్ల‌క్ష్యం మాత్రమే ఉందని ధ్వజమెత్తారు. అమ‌రావ‌తి పేరు చెప్పుకొని చంద్ర‌బాబు వర్గీయులు అందరూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు.. రామ్మోహన్ నాయుడు చెప్పగలరా?

అచ్చెన్నాయుడు.. రామ్మోహన్ నాయుడు చెప్పగలరా?


చంద్ర‌బాబు అన్ని విధాలుగా శ్రీకాకుళం జిల్లాకు ద్రోహం చేశారని ధర్మాన ఆరోపించారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించకుండా, పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా తానే అన్నీ చేసినట్లు చెప్పుకొంటోన్న అబ‌ద్ధాలకోరు చంద్రబాబేనని విమర్శించారు. ఎర్ర‌న్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు ధర్మాన. వెనుక‌బ‌డిన జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జ‌గ‌న్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+