మరో అమానవీయం- కార్డు పేమెంట్‌తో వైద్యం నిరాకరణ- క్యాష్ దొరక్క కోవిడ్ రోగి మృతి
కరోనా కల్లోలంతో పాటే మానవత్వానికి మచ్చతెచ్చే ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. మానవత్వానికి మారుపేరైన దేశంలో కరోనా మహమ్మారి దాని ఆనవాళ్లను సైతం కనుమరుగయ్యేలా చేస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. బ్యాంకులో డబ్బులున్నా ఆస్పత్రి సిబ్బంది కార్డు పేమెంట్ నిరాకరించడంతో డబ్బులు దొరక్క ఓ కోవిడ్ మహిళా రోగి ప్రాణాలు కోల్పోయిన అమానవీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. దీంతో ఆస్పత్రి తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video


మంటగలుస్తున్న మానవత్వం
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ పలు చోట్ల మానవత్వం మంటగలుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని శత్రువుల్లా చూసే ఆస్పత్రుల తీరుతో జనంపై చికిత్సపైనా ఏవగింపు వచ్చే పరిస్ధితి దాపురిస్తోంది. తాజాగా ఏఫీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇలాంటి మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కోవిడ్ రోగికి సకాలంలో వైద్యం అందించడంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వైఫల్యం ఆమెను రోడ్డుపైనే ప్రాణాలు విడిచేలా చేసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

క్యాష్ కడితేనే చికిత్స అన్న జీఎంఆర్ ఆస్పత్రి
శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన అంజలి అనే మహిళకు కోవిడ్ సోకింది. దీంతో ఆమె బంధువులు ఆమెను జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డు ద్వారా డబ్బులు చెల్లించి ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం తాము నగదు రూపంలోనే బిల్లు కట్టాలని కోరారు. దీంతో అప్పటికప్పుడు తమ వద్ద అంత డబ్బు లేదని, బ్యాంకులో ఉందని, కార్డు పేమెంట్స్ తీసుకోవాలని, కనీసం గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా అయినా తీసుకోవాలని కోరారు. అయినా ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి.

ఏటీఎంలో డబ్బుల కోసం 3 గంటలు తిరిగినా...
జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆస్పత్రి క్యాష్ పేమెంట్ చేస్తేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని తేల్చిచెప్పడంతో అంజలి బంధువులు దాదాపు మూడు గంటల పాటు ఏటీఎంల కోసం తిరిగారు. ఎంత తిరిగినా, ఎన్ని ఏటీఎంలు తిరిగినా కావాల్సిన డబ్బులు మాత్రం దొరకలేదు. దీంతో వారు రోడ్డపై రోగి అంజలిని అలాగే పెట్టుకుని డబ్పులు కోసం తీవ్రంగా శ్రమించారు. మధ్యలో 108 అంబులెన్స్‌కు కాల్ చేశాు. అయినా వారి నుంచీ స్పందన లేదు చివరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
రోడ్డుపైనే ప్రాణాలు విడిచిన అంజలి
ఓవైపు డబ్బులు కడితేనే జాయిన్ చేసుకుంటామన్న ఆస్పత్రి, మరోవైపు ఎంత తిరిగినా ఏటీఎంలో డబ్బులు దొరకని పరిస్ధితి. దీంతో రోడ్డుపై అలాగే ఇబ్బందులు పడ్డ అంజలి చివరికి అక్కడే ప్రాణలు విడిచింది. ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ ఆస్పత్రి నిర్వాకంతో ఓ నిండు ప్రాణం రోడ్డుపైనే బలైపోయింది. దీంతో ఆస్పత్రి తీరుపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ పేమెంట్స్ కాలంలోనూ క్యాష్ కోసం అంజలిని బలి తీసుకున్న జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications