శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీరని వరి సాగు కష్టాలు: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

వరిసాగుపై డైలాగ్ వారు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇక సీన్ ఏపీకి మారింది. అవును వరిసాగుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. వ్యవసాయంలో వరిసాగు వల్ల లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదని అన్నారు. ధర్మాన చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడరేంటీ అంటూ డిస్కషన్ తెరపైకి వచ్చింది.

ఒకవేళ అనుకూలంగా ఉంటే రొయ్యలు సాగు చేయడం మంచిదని ఇయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. దానికి కారణం గతంలో మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే ఆయన తెలిపారు. తలసరి ఆదాయం పెరగడానికి, మన తలరాతలు మారడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశామని ధర్మాన వివరించారు. ఇంకా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

ex minister dharmana prasada rao on paddy cultivation

మాట ఇచ్చినందున సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అని అభిప్రాయపడ్డారు. కష్టమైనా సంక్షేమం కొనసాగిస్తున్నామని వివరించారు. సంక్షేమం వల్ల కరోనా ప్రజల ఆకలి కేకలు వినపడలేదన్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని నొక్కి వక్కానించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని వివరించారు. కాలువలు, రోడ్లు అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళతాం ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఇచ్చినవే కాక.. ఇవ్వని హామీలను నెరవేరుస్తామని తెలిపారు.

ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ కలకలం రేపాయి. అధికార పార్టీకి చెందిన నేత ఇలా కామెంట్ చేయడం వెనక అంటూ చర్చ నడుస్తోంది. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసు మంత్రివర్గంలో ఉండగా.. ప్రసాదరావుకు ఛాన్స్ దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రసాదరావు మంత్రిగా పనిచేశారు. కానీ ఏపీలో మాత్రం పదవీ వరించలేదు. కానీ వరి సాగు గురించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

English summary
ex minister dharmana prasada rao on paddy cultivation. farmers are struggled in paddy cultivation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X