శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కాటుకు దూరంగా ఏపీలో ఆ రెండు జిల్లాలు- వెనుకబాటే వరమైందా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతూ పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావించినా తాజాగా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వల్ల అంతకంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. అయితే ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలుగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రికార్డు సృష్టించాయి. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.

కరోనా ఫ్రీ జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం

కరోనా ఫ్రీ జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం

ఏపీలోని 13 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఇప్పటి వరకూ 11 జిల్లాలకే పరిమితమైంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడైంది. దీంతో ఈ రెండు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలతో పాటు స్ధానిక అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

 విశాఖ జిల్లాలో కేసులు మాత్రం..

విశాఖ జిల్లాలో కేసులు మాత్రం..

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో నిన్నటి వరకూ 11 కేసులు మాత్రమే ఉండగా... తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది. వీటితో పాటు నమోదైన మరో కేసులో బాధితుడు కోలుకోవడంతో హోం క్వారంటైన్ లో ఉంచారు. విశాఖలో ఇప్పటివరకూ నమోదైన అన్ని కేసులను పరిశీలిస్తే వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి నుంచి కరోనా వైరస్ సోకిన వారు మాత్రమే బాధితులుగా ఉన్నారు.

సేఫ్ జోన్ లో శ్రీకాకుళం, విజయనగరం

సేఫ్ జోన్ లో శ్రీకాకుళం, విజయనగరం

విదేశాల నుంచి ప్రయాణికులతో పాటు ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో 87 కేసులు నమోదైనా శ్రీకాకుళం, విజయనగరం మాత్రం సేఫ్ గా ఉన్నాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన మైనది నేరుగా విమాన, సముద్ర మార్గాల్లో కనెక్టివిటీ లేకపోవడం. అలాగే ఈ రెండు జిల్లాల ప్రజలు ఇటు విశాఖ లేదా అటు ఒడిశాలోని భువనేశ్వర్, కటక్ వంటి ప్రాంతాలపై ఆధారపడుతూ ఉంటారు. అంతే తప్ప వీరికి ఏపీలోని మిగతా జిల్లాలలో నేరుగా సంబంధాలు ఉండేది చాలా తక్కువ.

 వెనుకబాటూ కాపాడింది..

వెనుకబాటూ కాపాడింది..


ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరుంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది విద్యావంతులు, విదేశాలకు వెళ్లిన వారూ తక్కువే. మిగిలిన జిల్లాలతో పోలిస్తే అభివృద్ధి అవకాశాలు కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టుల ఉనికి కానీ ఇక్కడ లేదు. దీంతో సహజంగానే విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలనుకునే వారు కూడా తక్కువే. ఇవన్నీ రెండు జిల్లాల వెనుకబాటుకు నిదర్శనమైతే.. ఇప్పుడు ఆయా కారణాలే వారిని కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడాయని తెలుస్తోంది.

English summary
north andhra districts of vizianagaram and srikakulam were recognised as coronavirus free districts in ap so far. not a single case reigistered in these districts due to precautionary measures and other reasons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X