పలాస-కాశీబుగ్గలో 144 సెక్షన్.. ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు.. భారీగా మొహరించిన పోలీసులు

పలాస-కాశీబుగ్గ పరిధిలో భూ కబ్జాలు, ఆక్రమణల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొద్దిరోజులుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండురోజుల క్రితం అర్థరాత్రి సమయంలో ఆక్రమణల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన ఇళ్లను కూల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.

చెరువులో భూమిని ఆక్రమించి నిర్మించారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీకి చెందిన సూర్యనారాయణ ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరికలు

కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరికలు

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సీదిరి అప్పలరాజుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జి గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈనెల 18వ తేదీలోగా క్షమాపణలు చెప్పకపోతే ఈనెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు జారీచేశారు. దీనిపై శిరీష స్పందించలేదు.

గౌతు శిరీష్ ప్రతిసవాల్

గౌతు శిరీష్ ప్రతిసవాల్


దీంతో వైసీపీ నాయకులు ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు జన సమీకరణ చేసి భారీగా నిరసన కార్యక్రమం చేపట్టాలని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తాము పార్టీ కార్యాలయంలోనే ఉంటామని, ఎలా ముట్టడిస్తారో చూస్తామంటూ గౌతు శిరీష్ ప్రతి సవాల్ విసిరారు.

వైసీపీ ముట్టడిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీసంఖ్యలో తరలిరావాలని ఆమె కోరారు. మరోవైపు తమ పార్టీకి చెందిన కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు లోకేష్ పలాస పర్యటనకు బయలుదేరగా శ్రీకాకుళం జాతీయ రహదారిపై పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

బహిరంగసభలకు అనుమతిలేదు

బహిరంగసభలకు అనుమతిలేదు


పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఎటువంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రాధిక ప్రకటించారు. అనుమతుల్లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రెండు జట్ట పట్టణాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులను మొహరించారు. బయట వ్యక్తులెవరినీ పట్టణంలోకి రానివ్వడంలేదు. రిజర్వుడు బలగాలను కూడా పిలిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+