వైసీపీ మూడో లిస్ట్: అచ్చెన్నకు జగన్ మార్క్ చెక్ పడిందా?
YSRCP 3rd list: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.
మొత్తం 21 మందితో కూడిన జాబితా ఇది. విజయనగరం లోక్‌సభ- చిన్న శ్రీను, ఏలూరు లోక్‌సభ- కారుమూరి సునీల్ కుమార్, విశాఖపట్నం లోక్‌సభ- బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం లోక్‌సభ- పేరాడ తిలక్, విజయవాడ లోక్‌సభ- కేశినేని నాని, కర్నూలు లోక్‌సభ- మంత్రి గుమ్మనూరి జయరాం, తిరుపతి లోక్‌సభ- కోనేటి ఆదిమూలం ఇన్‌ఛార్జీలుగా నియమితులయ్యారు.
ఇచ్ఛాపురం- పిరియ విజయ, టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్)- కంభం విజయ రాజు, రాయదుర్గం-మెట్టు గోవిందరెడ్డి, దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ)- ఎం సునీల్ కుమార్, చిత్తూరు- విజయానందరెడ్డి (ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్) ఇన్‌ఛార్జీలుగా నియమితులయ్యారు.

మదనపల్లి- నిస్సార్ అహ్మద్, రాజంపేట- ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, కోడుమూరు- డాక్టర్ సతీష్, ఆలూరు- బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ)- డాక్టర్ సతీష్, గూడూరు- మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ)- డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెనమలూరు- జోగి రమేష్, పెడన- ఉప్పాల రాము అపాయింట్ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను బరిలో దింపడం ఆసక్తి రేపింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం ఇది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు.
ఆయనపై దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. 2019 ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం లోక్‌సభకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడి చేతిలో అతి తక్కువ మెజారిటీ.. 6,653 ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు. ఇప్పుడు ఆయనను టెక్కలి అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ.












Click it and Unblock the Notifications