యాక్షన్ ప్యాక్డ్ మ్యాచ్: సూపర్ సండే: పాక్‌తో భారత్ పోరు: క్రికెట్‌కు మించి..డైలీహంట్‌లో అప్‌డేట్స్

అబుధాబి: క్రికెట్ ప్రేమికులు.. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచ కప్ ఇంకొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. అసలు సిసలు పోరాటానికి తెర లేవనుంది. తన ప్రపంచకప్ టోర్నమెంట్ జైత్రయాత్రను భారత్ క్రికెట్ జట్టు- తన చిరకాల ప్రత్యర్థితో ఆరంభించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. తన మొట్టమొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక అయింది.

సూపర్ సండే..

భారత కాలమానం ప్రకారం- ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఇన్నింగ్ మొదలవుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. అది మ్యాచ్ వరకు మాత్రమే కాదనేది రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులకు తెలుసు. మ్యాచ్ మాత్రమే కాదు.. అంతకుమించి- అనే స్థాయిలో ఉంటుంది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం అనేది చాలా అరుదు.

T20 World Cup 2021: Get Ready For The Super Sunday INDIA vs PAKISTAN T20 match with Dailyhunt

ఐసీసీ టోర్నమెంట్లలోనే..

ఇతర జట్ల తరహాలో అటు పాకిస్తాన్ గానీ, ఇటు టీమిండియా గానీ.. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఒక దేశం మరో దేశ పర్యటనకూ వెళ్లట్లేదు. సుదీర్ఘకాలంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న క్రీడా సంబంధాలు కూడా అంతంత మాత్రమే. క్రికెట్ ఆడాల్సి వస్తే.. అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లల్లో మాత్రమే సాధ్యపడుతోంది. అది కూడా తటస్థ వేదికల మీదే. అంతే తప్ప భారత జట్టు పాకిస్తాన్‌కు గానీ, పాక్ జట్టు భారత పర్యటనకు గానీ రావడం నిలిచిపోయి చాలా ఏళ్లవుతోంది.

మ్యాచ్‌కు మించి..

ఇదివరకు ఆసియాకప్, ఆ తరువాత ప్రపంచకప్, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్.. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండే అంశం. ప్రత్యర్థిని ఓడించాలనే పట్టుదల రెండు జట్లలోనూ కనిపిస్తుంటుంది. అలాంటి అన్ని సందర్భాల్లోనూ విజయం.. భారత్‌ను వరించింది.

భారత్‌ను ఓడించని పాక్

ప్రపంచకప్ టోర్నమెంట్‌లో గానీ, టీ20 వరల్డ్ కప్‌లో గానీ పాకిస్తాన్ జట్టు ఒక్కసారిగా కూడా టీమిండియాను ఓడించలేదు. 2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్‌లోనూ భారత్ చేతిలో పాకిస్తాన్ మట్టి కరిచింది. ఈ సారి ఆ ఆనవాయితీకి బ్రేక్ వేయాలనే పట్టుదలతో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్ మ్యాచ్ కోసం సన్నాహాలు చేస్తోండగా.. తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో టీమిండియా సన్నద్ధమౌతోంది.

గ్రాండ్ ప్రిక్స్..

టీ20 ప్రపంచకప్‌తో పాటు- మిసానోలో ఎఫ్ఐఎం మోటోజీపీ వరల్డ్ కప్ ఛాంపియన్‌షిప్ కొంతవిరామం తరువాత మళ్లీ ప్రారంభం కానుంది. ఎమీలియా-రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. మాన్‌స్టర్ ఎనర్జీ యమహ మోటోజీపీ ఫ్యాబియో క్వార్టరారో, పెట్రోనాస్ యమహ ఎస్సార్టీ వేలంటైనో రోస్సి మధ్య టైటిల్ పోరు కొనసాగబోతుండటం వచ్చేవారం క్రీడా ప్రపంచాన్ని మరింత ఉత్కంఠతకు గురి చేసేలా కనిపిస్తోంది.

స్పానిష్ లీగ్ ఫుట్‌బాల్..

స్పానిష్ లీగ్ ఫుట్‌బాల్ క్యాలెండర్‌లో బిగ్గెస్ట్ మ్యాచ్‌గా చెప్పుకొనే రియల్ మ్యాడ్రిడ్, బార్సిలోనా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ అదే సమయానికి మొదలవుతుంది. 7:45 నిమిషాలకు శాంటియాగోలో ఈ మ్యాచ్ ఉంటుంది. ఇక 9 గంటలకు ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆరంభమౌతుంది. రెడ్స్-లివర్‌పూల్ మధ్య జరిగే మ్యాచ్‌కు మాంచెస్టర్ యునైటెడ్ హోస్ట్ చేయనుంది. అక్టోబర్-నవంబర్‌లల్లో సాధారణంగా ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచులు నడుస్తుంటాయి.

ఉత్కంఠభరితంగా రేసింగ్..

రాత్రి 9:30 గంటలకు మరో బిగ్ గేమ్ మొదలవుతుంది. నపోలి-ఎఎస్ రోమా మధ్య ఇటాలియన్ సిరీస్ ఉంటుంది. అర్ధరాత్రి 12:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటర్ మిలన్ జువెంటస్ తలపడతాయి. అదే సమయానికి అమెరికాలోని టెక్సాస్ ఆస్టిన్‌లో యూఎస్ ఫార్ములా 1 రేస్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. బెల్జియన్-డచ్ రేసర్ మ్యాక్స్ వెర్స్‌టాపెన్, బ్రిటీష్ రేసర్ లెవిస్ హ్యామిటన్ మధ్య ఉత్కంఠభరిత పోరు ఉంటుంది.

డైలీహంట్ స్పోర్ట్స్ జోన్‌లో లైవ్ అప్‌డేట్స్..

ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా.. చదువుకునేలా ప్రముఖ న్యూస్ యాప్ డైలీహంట్ స్పోర్ట్స్ జోన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, లైవ్ అప్‌డేట్స్ అన్నీ కూడా మీకు అందించడానికి డైలీహంట్ స్పోర్ట్స్ జోన్‌ సన్నాహాలు చేసింది. డైలీహంట్ స్పోర్ట్స్‌జోన్‌ను సందర్శించడం ద్వారా మ్యాచ్‌ల వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో లైవ్ అప్‌డేట్స్, వార్తల రూపంలో తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+