TSRTC: సంక్రాంతికి ఫుల్ అయిన ఆర్టీసీ.. 1.21 కోట్ల మంది ప్రయాణం..
ఆర్టీసీ బస్సులన్నీ ఈ సంక్రాంతికి ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. పండుగ తర్వాత సొంతూళ్లకు వెళ్లేవారు కూడా భారీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది.

5 లక్షలు మంది
గత సంవత్సరం సంక్రాంతితో పోలిస్తే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించారని సజ్జనార్ వివరించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించిన ఆర్టీసీ సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. ఈ సంక్రాంతి పండుగకు జనవరి 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులను నడిపామని ఆర్టీసీ తెలిపింది. ముందుగా పండుగ రోజుల్లో 2,384 బస్సులను నడపాలని నిర్ణయించామని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లుగా పేర్కొంది.

212 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి సజ్జనారు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమ సంస్థను ఇలానే ప్రోత్సహించాలన్నారు. ఇక పండక్కి సొంతూళ్లకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం దాదాపు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ పేర్కొంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 212 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది.

మంగళ, బుధ
మంగళ, బుధవారాల్లో ఈ బస్సులు నడుస్తాయని వెల్లడించింది. పండుగు ముందు సీటీ బస్సుల్లో కూడా రద్దీ పెరిగినట్లు ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతుండడంతో పట్నంలో సీటీ బస్సులు సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications