తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?: కొత్త వేరియంట్ లేదన్న డీహెచ్, కానీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన తాజా బులిటెన్‌లోవెల్లడించింది. మొత్తం 989 పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా తేలిందిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, కరీంనగర్‌లో ఒక్క కేసు నమోదు అయింది. ఇక కోవిడ్ 19 నుంచి 24 గంటల వ్యవధిలో ఒకరు కోలుకోగా, మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇది ఇలావుంటే, తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు ఊరటనిచ్చే వార్తను తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. జేఎన్ 1 సబ్‌వేరియంట్ కేసులు నమోదు కాలేదని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకిన ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్ట్ అయిన వారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఆక్సిజన్ సిలిండర్లను సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.
అయితే, తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు నమోదయ్యాయంటూ కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొనడం గమనార్హం.












Click it and Unblock the Notifications