తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు 105కోట్లు విడుదల; కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్!!
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్ణయించింది. ఈ మేరకు జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కెసిఆర్ తెలిపారు. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు జరగాలని కెసిఆర్ కలెక్టర్లను కోరారు. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా ఉత్సవాలు జరగాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నేడు డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాలను సక్సెస్ చేసే బాధ్యత కలెక్టర్ల పైన ఉందన్నారు. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం కలెక్టర్లకు వివరించారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/r6WEMjG1MO
— Telangana CMO (@TelanganaCMO) May 25, 2023
మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అధికార యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చెయ్యాలని కేసీఆర్ వారిని కోరారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications