తెలంగాణలో కరోనా విజృంభణ, వెయ్యికి పైగా కేసులు, వైరస్ సోకినవారు జాగ్రత్త..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు కనీసం వెయ్యి, ఆపై నమోదవుతున్నాయి. అయితే వైరస్ సోకిన వారి రికవరీ కూడా అదేస్థాయిలో అవుతున్నారు. గత 24 గంటల్లో 1050 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 2 లక్షల 56 వేల 713కు చేరింది. వీరిలో 2 లక్షల 38 వేల 908 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 1736 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

16 వేల 404 మంది ఆస్పత్రిలో.. 13 వేల 867 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్ సోకి ఒకరోజులో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం సంఖ్య 1401 కి చేరింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కరోనా వైరస్ విజృంభణ కాస్త తక్కువగానే ఉంది. అయితే సీవియర్ కేసుల శాతం కూడా లో గా నమోదవుతోంది. ఇదీ కాస్త సానుకూల అంశంగా మారింది.

1050 coronavirus cases register in telangana

జీహెచ్‌ఎంసీ పరిధిలో 232 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్దిరోజులగా 500 లోపు కేసులు వస్తున్నాయి. అంతకుముందు వెయ్యి వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేడ్చల్‌ మాల్కాజిగిరిలో 90, రంగారెడ్డిలో 75 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.

దీపావళి సందర్భంగా టపాకులతో దుమ్ము, ధూళి వచ్చే అవకాశం ఉంది. చేతులకు శానిటైజర్ రాసుకొవద్దని.. అలాగే వైరస్ సోకి నయమైన వారు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ టపాకుల ధూళితో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీలైనంత సమయం ఇంట్లోనే ఉండాలని.. బయటకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని సజెస్ట్ చేస్తున్నారు.

Recommended Video

    AP Corona Update : 2618 New Covid Cases Reported In Andhra Pradesh | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+