తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన రికవరీ, 12 జిల్లాల్లో సున్నా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 22,650 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 106 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,72,052కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3961గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 980 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,64,212కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,879 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 49. జగిత్యాలలో 00, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 05, ఖమ్మంలో 07, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 01, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 05, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 02, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 04, రాజన్న సిరిసిల్లలో 01, రంగారెడ్డిలో 09, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 01, సూర్యాపేటలో 02, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 02, వరంగల్ అర్బన్‌లో 02, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 12 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications