పిట్ట కొంచెం.. కూత ఘనం, 11 ఏళ్లకే డిగ్రీ ఫస్టియర్ పరీక్ష రాస్తున్న విద్యార్థి!
హైదరాబాద్: పదకొండేళ్ల వయసులో ఎవరైనా మహా అయితే ఆరో తరగతో, ఏడో తరగతో చదువుతుంటారు. కానీ ఈ బుడతడు మాత్రం ఏకంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయబోతున్నాడు. అందులోనూ అతడు చదువుతున్న కోర్సు పేరేమిటో తెలుసా? మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం.
ఈ పిట్ట కొంచెం.. కూత ఘనం పేరు అగస్త్య జైశ్వాల్. యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతున్న ఈ బుడతడు గురువారం మధ్యాహ్నం తార్నాకలోని ఏలియన్స్ డిగ్రీ కాలేజీలో జరిగే బీఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఫస్టియర్ పరీక్ష రాయబోతున్నాడు.

తెలంగాణలో 11 ఏళ్లకే ఈ పరీక్ష రాయనున్న మొట్టమొదటి విద్యార్థి అగస్త్యే. గతంలో కూడా తెలంగాణలో అతి చిన్న వయసులోనే 63 శాతం మార్కులతో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం పాసైన తొలి విద్యార్థిగా అగస్త్య జైశ్వాల్ రికార్డు సృష్టించాడు.

అంతేకాదు, తెలంగాణలో 9 ఏళ్ల వయసులోనే 7.5 జీపీఏతో టెన్త్ క్లాస్ పాసైన మొట్టమొదటి విద్యార్థి కూడా అగస్త్యే. ఈ బుడతడు చదువులో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షిద్దాం.












Click it and Unblock the Notifications