తెలంగాణలో కొత్తగా 111 కొత్త కేసులు: 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. దసరా ప్రభావతం గత 24 గంటల్లో భారీగా కేసులు తగ్గాయి. 30,050 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 111 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,68,833కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3937గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 954 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

 111 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 187 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,60,917కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3979 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 09, జీహెచ్ఎంసీలో 29. జగిత్యాలలో 01, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 09, ఖమ్మంలో 11, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 07, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 06, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 02, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 05, పెద్దపల్లిలో 03, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 08, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 00, వికారాబాద్ లో 00, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 02, వరంగల్ అర్బన్‌లో 02, యాదాద్రి భువనగిరిలో 01 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం అసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, , నారాయణ్ పేట, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 9,23,003 మందిని పరీక్షించగా, కొత్తగా 15,981 కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం 166 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,51,980కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 17,861 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.40 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 98.08 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 0.59శాతంగా ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. దసరా సెలవు దినం కావడంతో వ్యాక్సినేషన్ కాస్త నెమ్మదించింది. 8.36 లక్షల మంది టీకా వేసుకున్నారు. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 97.23కోట్లు దాటింది. త్వరలోనే వంద కోట్ల వ్యాక్నినేషన్ పూర్తి చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+