భద్రాద్రి రామయ్య సేవలో 118 ఏళ్ల భక్తుడు

118 years old man at Bhadrachala Ramudu
భద్రాచలం: రామాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీసీతారామచంద్రస్వామిని 118 సంవత్సరాల వయస్సు ఉన్న భక్తుడు ఒకరు దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా కాకనూరు మండలం శివపురం గ్రామానికి చెందిన శ్రీమహాయోగి సరస్వతి తన ఆశ్రమం నుంచి రామాలయానికి దర్శనం నిమిత్తం వచ్చారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.

దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆయనతో మాట్లాడారు. 70 ఏళ్ల కిందట తాను కొలను భరతక్షేత్రంలో కఠోర తపస్సు చేసినట్లుగా చెప్పారు. అపుడే విజయవాడ నుంచి భద్రాచలం వరకు తాను కాలినడకన వచ్చి రామయ్య దర్శనం చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. దైవచింతనతోనే ఆరోగ్యం సాధ్యమని, నిర్మలమైన మనస్సుతో కల్మషం లేకుండా జీవించడమే జీవిత రహస్యం అన్నారు. ఇదిలా ఉండగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామాలయంలో రామకోటి స్తూపాల వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.

లక్ష గోవుల పిడకల మహా యాగం

ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శిల్పినగర్‌లో శ్రీ దుర్గా గాయత్రీ సర్వదేవతా శక్తి పీఠంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం శ్రీ సకలైశ్వర్యప్రద లక్ష ఆవుపిడకల మహాయాగం ప్రారంభమైంది. ఈ యాగం నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుంది.

తొలిరోజు శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, అంకురారోపణ, శ్రీలక్ష్మీ గణపతి హోమం యజ్ఞక్రతువు జరిపించారు. సకలాభీష్టవృద్ధి, ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, పాడిపంటలు తదితర కార్యాలు నెరవేర్చుటకు విశ్వశాంతి కోసం పవిత్ర గోదావరి తీరంలో యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాకరాల శర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+