తాను మరణించి నలుగురికి ప్రాణాలు పోసిన 12ఏళ్ల బాలుడు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన 12ఏళ్ల బాలుడి అవయవాలను దానం చేయడంతో మరో నలుగురు ప్రాణాలు నిలబడ్డాయి. కొడుకు మరణించడంతో అతని అవయవాల దానం చేసేందుకు అంగీకరించిన బాలుడి తల్లిదండ్రులు ఇందుకు కారణమయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
నిమ్స్ జీవన్‌దాన్ వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. ప్యారడైజ్ బాలంరాయి వద్ద నివాసం ఉండే పి.సత్యనారాయణ జీఎంఆర్ కార్గోలో మేనేజర్. భార్య విమల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వీరికి వైష్ణవ్ (12) కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ దంపతులు జులై 12న కారులో వైష్ణవ్‌తో పాటు బంధువుల పిల్లలు ముగ్గురితో కలిసి రామోజీ ఫిలింసిటీ వద్ద నుంచి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో కారు వెనుక కూర్చున్న నలుగురు పిల్లలలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా వైష్ణవ్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న సత్యనారాయణకు ఛాతీపై బలమైన గాయాలు కాగా, విమల కాలు విరిగింది. ముగ్గురినీ వెంటనే సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైష్ణవ్‌ను అక్కడి నుంచి లక్డికాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న వైష్ణవ్‌కు మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. జీవన్‌దాన్ ప్రతినిధులు సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ, విమల వద్దకు వెళ్లి విషయం చెప్పి వారిని వైష్ణవ్ అవయవాలను దానం చేసేందుకు ఒప్పించారు.
వైద్యులు వైష్ణవ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను తొలగించారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ పోర్టు నుంచి ఆస్పత్రికి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బాలుడి అవయవాలతో ప్రాణాలు పోశారు వైద్యులు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications